Sara Tendulkar : సచిన్ కూతురు అరుదైన ఘనత.. రూ.1137 కోట్ల క్యాంపెయిన్‌కు బ్రాండ్ అంబాసిడర్‎గా నియామకం

Sara Tendulkar : సచిన్ కూతురు అరుదైన ఘనత.. రూ.1137 కోట్ల క్యాంపెయిన్‌కు బ్రాండ్ అంబాసిడర్‎గా నియామకం


Sara Tendulkar : ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ దేశంలో పర్యాటకాన్ని పెంచడానికి త్వరలో ఒక భారీ క్యాంపెయినింగ్ ప్రారంభించబోతోంది. ఈ ప్రచారంలో భాగంగా భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు. ఆస్ట్రేలియా టూరిజంను పెంచే బాధ్యతను సారా టెండూల్కర్‌కు అప్పగించారు. ఈ క్యాంపెయిన్ కోసం మొత్తం 130 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.1137 కోట్లు) ఖర్చు చేయనున్నారు.

‘కమ్ అండ్ సే గ’డే’ క్యాంపెయిన్‌లో సారా టెండూల్కర్..

ఆస్ట్రేలియా టూరిజాన్ని ప్రోత్సహించడానికి ప్రారంభించిన ఈ క్యాంపెయిన్ ప్రపంచంలోని అనేక పెద్ద దేశాలలో జరగనుంది. భారత్‌తో పాటు అమెరికా, యూకే, చైనా, జపాన్ వంటి దేశాలలో ఈ ప్రచారం జరుగుతుంది. ప్రతి దేశం నుంచి ఒక ప్రముఖ వ్యక్తిని ఈ క్యాంపెయిన్‌లో భాగం చేశారు. దీని ఉద్దేశ్యం ఆయా దేశాల ప్రజలు ఆస్ట్రేలియాను సందర్శించడానికి ప్రోత్సహించడమే. దీని ద్వారా ఆస్ట్రేలియా టూరిజం పెరుగుతుంది, ఆదాయం కూడా పెరుగుతుంది. టూరిజం ఆస్ట్రేలియా మేనేజింగ్ డైరెక్టర్ ఫిలిపా హారిసన్ మాట్లాడుతూ.. “మా కొత్త క్యాంపెయిన్‌లో రూబీతో పాటు ఐదు వేర్వేరు రంగాల నుంచి వచ్చిన టాలెంటెడ్ పీపుల్ పాల్గొంటారు. వారు ఆస్ట్రేలియాలో గడిపిన తమ అనుభవాలను ప్రజలతో పంచుకుంటారు” అని తెలిపారు.

ఈ కొత్త క్యాంపెయిన్‌లో వివిధ దేశాల నుంచి పలువురు ప్రముఖులు ఉన్నారు:

అమెరికా: ఆస్ట్రేలియా వన్యప్రాణి సంరక్షణవాది రాబర్ట్ ఇర్విన్.

బ్రిటన్: ఫుడ్ రైటర్, టీవీ కుక్ నిగెల్లా లాసన్.

చైనా: నటుడు యోష్ యూ

భారతదేశం: పారిశ్రామికవేత్త, సోషల్ యాక్టివిస్ట్ సారా టెండూల్కర్.

జపాన్: మీడియా పర్సనాలిటీ, కమెడీయన్ అబారెరు-కున్.

సారా టెండూల్కర్‌కు ఆస్ట్రేలియా అంటే ఇష్టం..

సారా టెండూల్కర్ ఇప్పటికే చాలాసార్లు ఆస్ట్రేలియాను సందర్శించారు. మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్ కూతురు కూడా సారాకు మంచి స్నేహితురాలు. సారా ఆస్ట్రేలియా వెళ్లినప్పుడల్లా ఆమెను కలుస్తుంటారు. వీరిద్దరూ కలిసి సోషల్ మీడియాలో చాలాసార్లు ఫోటోలను షేర్ చేసుకున్నారు.

ఆస్ట్రేలియాలో సందర్శించడానికి సిడ్నీ ఒపేరా హౌస్, సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్, రాయల్ బొటానిక్ గార్డెన్ వంటివి ఉన్నాయి. గ్రేట్ బారియర్ రీఫ్ స్కూబా డైవింగ్, స్నార్కెలింగ్, అండర్ వాటర్ యాక్టివిటీలకు ప్రసిద్ధి. ఉలురులోని రాతి గుహలు కూడా పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఇక్కడ సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మెల్బోర్న్‌లో కూడా చూడడానికి చాలా మంచి ప్రదేశాలు ఉన్నాయి.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *