Sankranthi Movies: సంక్రాంతికి సినిమాల జాతర.. వచ్చే ఏడాది వచ్చే మూవీస్ ఇవే..

Sankranthi Movies: సంక్రాంతికి సినిమాల జాతర.. వచ్చే ఏడాది వచ్చే మూవీస్ ఇవే..


సంక్రాంతికి రావడమనేది హీరోలు ప్రస్టేజ్‌గా తీసుకుంటున్నారు. సీనియర్ హీరోలైతే ఏడాదికి ఒక్క సినిమా చేస్తే.. అది కచ్చితంగా పండక్కి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సంక్రాంతిని బాలయ్య తీసుకుంటే.. 2026 పొంగల్‌ను చిరంజీవి టార్గెట్ చేస్తున్నారు. అనిల్ రావిపూడితో చిరు చేయబోయే సినిమా పండక్కి రానుంది. ఇప్పటికే షూటింగ్ 40 శాతం పూర్తైంది.

ఇవి కూడా చదవండి: Ajith Kumar: అజిత్ పక్కన ఉన్న కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా.. ? పాన్ ఇండియా హీరో కమ్ విలన్.. ఎవరంటే..

మూడు నెలల్లో టాకీ పూర్తి చేసి.. ఆర్నెళ్లలో సినిమా విడుదల చేయాలనేది అనిల్ ప్లాన్. చిరు కూడా దీనికే స్టిక్ అయ్యారు. అనుకున్నట్లుగానే షూట్ అయిపోతుంది.. సంక్రాంతికి కచ్చితంగా మెగా 157 సందడి చేయబోతుంది. దీనికి మన శివశంకర వరప్రసాద్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. నయనతార ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: Kamal Haasan: అప్పుడు చిన్న హీరోయిన్.. ఇప్పుడు కమల్ హాసన్‏తోనే.. ఎవరో గుర్తుపట్టారా.. ?

రెండేళ్ళ కింద చిరంజీవితో కలిసి వాల్తేరు వీరయ్య అంటూ పండక్కి వచ్చిన మాస్ రాజా.. 2026 సంక్రాంతికి మాత్రం చిరంజీవితో పోటీ పడబోతున్నారు. కిషోర్ తిరుమలతో ఈయన చేయబోయే సినిమా సంక్రాంతిని టార్గెట్ చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత రవితేజ చేయబోయే ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. దానికంటే ముందే మాస్ జాతరతో వస్తున్నారు రవితేజ. సంక్రాంతికి కొత్త ఎంట్రీ వచ్చేలా కనిపిస్తుంది.. డిసెంబర్ 5న అనుకున్న రాజా సాబ్ కాస్తా పొంగల్ బరిలో దిగుతున్నాడని తెలుస్తుంది. ఒకవేళ ప్రభాస్ వస్తే.. రేస్ మరింత ఆసక్తికరంగా మారడం ఖాయం. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ చిరు, రవితేజ ఉన్నారు.. పైగా విజయ్ జననాయగన్ అప్పుడే రానుంది. మొత్తానికి సంక్రాంతి 2026 చాలా భారీగా ఉండబోతుందని అర్థమవుతుంది.

ఇవి కూడా చదవండి: Cinema: ఇదెక్కడి సినిమా రా బాబు.. రూ.16 కోట్లు పెడితే 400 కోట్ల కలెక్షన్స్.. బాక్సాఫీస్ ఆగం చేసిన మూవీ..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *