Headlines

Sanju Samson : సూర్య మాస్టర్ ప్లాన్.. సంజూ శాంసన్ కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడినట్లేనా?

Sanju Samson : సూర్య మాస్టర్ ప్లాన్.. సంజూ శాంసన్ కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడినట్లేనా?


Sanju Samson : టీ20 వరల్డ్ కప్‌కు ముందు జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లోనే టీమిండియా మేనేజ్మెంట్ భారీ సర్ ప్రైజ్ ఇచ్చింది. నవీ ముంబై వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న ఈ పోరులో టాస్ గెలిచిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే అందరూ ఊహించినట్లుగా కాకుండా ఓపెనింగ్‌లో అభిషేక్ శర్మతో పాటు ఇషాన్ కిషన్‌ను పంపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. మొన్నటి వరకు ఓపెనర్‌గా, వికెట్ కీపర్‌గా ఉన్న సంజూ శాంసన్‌ను కాదని.. ఇషాన్ కిషన్‌కు ఈ బాధ్యతలు అప్పగించడం చూస్తుంటే, వరల్డ్ కప్ ప్రధాన మ్యాచ్‌ల్లో కూడా ఇదే ఫార్ములా కొనసాగుతుందని అర్థమవుతోంది.

ఇషాన్ కిషన్ అదరగొట్టినందుకే ఈ గిఫ్ట్

ఇషాన్ కిషన్‌కు ఈ అవకాశం ఊరికే రాలేదు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఇషాన్ శివతాండవం చేశాడు. ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీతో ఏకంగా 215 పరుగులు రాబట్టి ఫామ్ అంటే తనదే అని నిరూపించుకున్నాడు. ఆ సిరీస్ చివరి మ్యాచ్‌లోనే సంజూ నుంచి కీపింగ్ గ్లౌజులు అందుకున్న ఇషాన్, ఇప్పుడు ఓపెనింగ్ స్లాట్‌ను కూడా దక్కించుకున్నాడు. గతేడాది పర్ఫార్మెన్స్ ఆధారంగా చూస్తే, సంజూ కంటే ఇషాన్‌కే మేనేజ్మెంట్ ఓటు వేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

సంజూ శాంసన్ పని అయిపోయినట్లేనా?

వరుసగా వస్తున్న అవకాశాలను చేజార్చుకోవడం సంజూ శాంసన్‌కు శాపంగా మారింది. న్యూజిలాండ్ సిరీస్‌లో ఐదు మ్యాచ్‌ల్లోనూ సంజూ విఫలం కావడంతో సెలెక్టర్ల ఓపిక నశించినట్లుంది. ఇప్పుడు ఇషాన్ ఓపెనర్‌గా వస్తుండటంతో, మూడో స్థానంలో తిలక్ వర్మ వచ్చే అవకాశం ఉంది. గాయం నుంచి కోలుకొని వస్తున్న తిలక్ వర్మకు కూడా ఇది పెద్ద పరీక్షే. ఒకవేళ ఇషాన్, అభిషేక్ జోడీ గనుక వార్మప్ మ్యాచ్‌లో క్లిక్ అయితే, వరల్డ్ కప్ టోర్నీ ఆరంభ మ్యాచ్‌ల్లో సంజూ శాంసన్ బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది.

ధోనీ చెప్పిన కఠిన వాస్తవం..

మరోవైపు టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వరల్డ్ కప్‌లో భారత్‌కు అసలైన ముప్పు కేవలం ప్రత్యర్థి జట్ల నుంచే కాదు, టీమ్ కాంబినేషన్ కుదరకపోవడం వల్ల కూడా రావచ్చని ఆయన హెచ్చరించారు. క్వాలిటీ బౌలింగ్ అటాక్ ఉన్న సౌతాఫ్రికా లాంటి జట్లపై మన కుర్రాళ్లు ఎలా ఆడతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇషాన్, అభిషేక్ తమ దూకుడును కొనసాగిస్తారా లేదా అనేది మరికొద్ది సేపట్లో తేలిపోనుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *