హిందూ గ్రంథాల్లో సాముద్రిక శాస్త్రం ఒకటి. ఇది శరీర నిర్మాణం, ఆకారం, గుర్తులు విధితో ముడిపడి ఉంది. సాముద్రిక శాస్త్రం పురాతన గ్రంథాలలో ఒకటి. ఇది మనిషి శరీరంపై ఉన్న గుర్తుల ఆధారంగా అతని స్వభావం, భవిష్యత్తు, అదృష్టాన్ని అంచనా వేస్తుంది. దీని ప్రకారం శరీరంపై ఉన్న పుట్టుమచ్చలు, వాటి స్థానం, పరిమాణం, రంగు వ్యక్తి జీవితంలో ప్రత్యేక పాత్ర పోషిస్తాయి. సాముద్రిక శాస్త్రం ప్రకారం ఆ ఐదు ప్రత్యేక ప్రదేశాల గురించి తెలుసుకుందాం.. కొన్ని పుట్టుమచ్చలు వ్యక్తిని అదృష్టవంతుడిని చేస్తుంది.
అరచేతిలో పుట్టుమచ్చ ఉంటే అది సంపద, విజయాన్ని సూచిస్తుంది.
సాముద్రిక శాస్త్రం ప్రకారం పురుషుడి కుడి అరచేతిలో ముఖ్యంగా బొటనవేలు కింద లేదా మధ్య భాగంలో పుట్టుమచ్చ ఉంటే.. అతను జీవితంలో సంపద, శ్రేయస్సు, విజయాన్ని సాధిస్తాడని సూచిస్తుంది. అలాంటి వ్యక్తులు తమ కర్మ బలంతో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. అదృష్టం ఎల్లప్పుడూ వీరికి మద్దతు ఇస్తుంది.
అరికాళ్ళపై ఉన్న పుట్టుమచ్చ ఉంటే
అరికాళ్ళపై పుట్టుమచ్చలు ఉంటే చాలా శుభప్రదంగా భావిస్తారు. అరికాళ్ళపై పుట్టుమచ్చలు ఉన్నవారు చాలా అదృష్టవంతులు అని సాముద్రిక శాస్త్రం చెబుతోంది. అలాంటి వారు జీవితంలో చాలా ప్రయాణాలు చేస్తారు. విదేశాలకు వెళ్లి రాజభోగాలు వంటి సౌకర్యాలు పొందుతారు.
ఇవి కూడా చదవండి
నుదిటిపై పుట్టుమచ్చ,నాయకత్వం, కీర్తి
నుదిటిపై, ముఖ్యంగా మధ్య భాగంలో పుట్టుమచ్చ ఉంటే ఆ వ్యక్తి నాయకత్వ సామర్ధ్యాన్ని కలిగి ఉన్నారని సూచిస్తుంది. సాముద్రిక శాస్త్రం ప్రకారం అలాంటి వ్యక్తులు సమాజంలో ప్రతిష్టను పొందుతారు. రాజకీయాలు, పరిపాలన లేదా నాయకత్వంలో విజయం సాధిస్తారు. జీవితంలో కీర్తిని సాధిస్తారు.
మెడ మీద పుట్టుమచ్చ తిండి బట్టకి కొరత ఉండదు
మెడ ముందు భాగంలో పుట్టుమచ్చ ఉండటం కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అటువంటి వ్యక్తికి ఆహారం, బట్టలు, డబ్బు కొరత ఎప్పుడూ ఉండదని ఇది సూచిస్తుంది. ఇలాంటి వ్యక్తులు సౌమ్య స్వభావం కలిగి ఉంటారు. వీరు మంచి స్నేహితులు. ఎప్పుడూ బంధువుల మద్దతు పొందుతారు. మెడపై పుట్టుమచ్చలు ఉన్నవారు మధురంగా మాట్లాడే స్వభావం కలిగి ఉంటారు. అందరితో ప్రేమించబడతారు.
నాభి దగ్గర పుట్టుమచ్చ పిల్లల వలన ఆనందానికి
నాభి దగ్గర పుట్టుమచ్చ ఉండటం కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. సాముద్రిక శాస్త్రం ప్రకారం ఇలాంటి వారికి సంతాన ఆనందం, ఆర్థిక శ్రేయస్సు, భౌతిక సుఖాలు లభిస్తాయి. వీరి జీవితంలో స్థిరత్వం, కుటుంబ సమతుల్యత ఉంటుంది. అలాగే జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఇలాంటి వ్యక్తులు ఎటువంటి పరిస్థితిలు ఎదురైనా విజయం సాధిస్తారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.