Sai Dhanshika: ‘ఆ తాగుబోతు అలా ప్రవర్తించడంతో చితగ్గొట్టా’.. విశాల్‌ ప్రేయసి కామెంట్స్ వైరల్

Sai Dhanshika: ‘ఆ తాగుబోతు అలా ప్రవర్తించడంతో చితగ్గొట్టా’.. విశాల్‌ ప్రేయసి కామెంట్స్ వైరల్


Sai Dhanshika: ‘ఆ తాగుబోతు అలా ప్రవర్తించడంతో చితగ్గొట్టా’.. విశాల్‌ ప్రేయసి కామెంట్స్ వైరల్

రజనీకాంత్ నటించిన కబాలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది కోలీవుడ్ హీరోయిన్ సాయి ధన్సిక. దీని తర్వాత పలు తమిళం, కన్నడ, మలయాళం సినిమాల్లోనూ యాక్ట్ చేసిందీ అందాల తార. తెలుగులోనూ షికారు అనే సినిమాలో హీరోయిన్ గా చేసిందీ ముద్దుగుమ్మ. సినిమాల సంగతి పక్కన పెడితే..ఈ హీరోయిన్ త్వరలోనే హీరో విశాల్ తో కలిసి పెళ్లిపీటలెక్కనుంది. ఎప్పటినుంచో ప్రేమలో ఉన్న వీరు గతేడాది ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అంతేకాదు గతేడాది ఆగస్టు 29నే పెళ్లి కూడా ప్లాన్ చేసుకున్నారు. అయితే నడిగర్‌ సంఘం భవనం ఇంకా పూర్తి కాకపోవడంతో పెళ్లి వాయిదా వేసుకున్నారీ లవ్ బర్డ్స్. ఇదిలా ఉంటే సాయి ధన్సిక ఇటీవల ఒక వ్యక్తిని చితకబాదిందట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా షేర్ చేసుకుంది. ఈ బ్యూటీ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా యోగి డా. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా శుక్రవారం (ఫిబ్రవరి 06) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న సాయి ధన్సిక ఈ మూవీ షూటింగ్ సెట్ లో జరిగిన ఒక సంఘటనను బయటపెట్టింది.

‘ కేరళలో సినిమా షూటింగ్‌ జరుగుతోంది. ఓ వ్యక్తి నాతో ఫోటో దిగాలని మా అంకుల్‌ను అడిగాడు. అయితే అతడు తాగి ఉన్నాడని గమనించి ఫొటో దిగేందుకు ఒప్పుకోలేదు. వెంటనే ఆ తాగుబోతు మా అంకుల్‌ను కొట్టి పారిపోయేందుకు ట్రై చేశాడు. అదంతా చూసి ఒక్కసారిగా నాలో కోపం కట్టలు తెచ్చుకుంది. వాడిని పరిగెత్తి వెళ్లి మరీ పట్టుకుని చితకబాదాను. సుమారు పదినిమిషాల పాటు ఆ తాగు బోతును కొడుతూనే ఉన్నాను. డైరెక్టర్‌, హీరో నా చేతులు పట్టుకుని నన్ను కంట్రోల్‌ చేసేందుకు ప్రయత్నించారు. నా మనుషుల్ని ఏదైనా అంటే నేను చూస్తూ ఊరుకోలేను. అందుకే ఆ తాగుబోతను బాగా కొట్టాను. సెల్ఫ్ డిఫెన్స్ కోసం నేను స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నాను. ఆ టాలెంట్‌ అంతా అప్పుడు ఉపయోగించాను’ అని సాయి ధన్సిక చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ హీరోయిన్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

సాయి ధన్సిక లేటెస్ట్ ఫొటోస్..

 

View this post on Instagram

 

A post shared by Sai Dhanshika (@saidhanshika)

విశాల్- సాయి ధన్సికల ఎంగేజ్మెంట్ ఫొటోస్..

 

View this post on Instagram

 

A post shared by Vishal (@actorvishalofficial)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *