మున్సిపల్ ఎన్నికలల్లో అనుకూలమైన ఫలితాలు రావడంతో రేవంత్ సర్కార్ ఫుల్ జోల్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రైతులకు గుడ్‌న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది. ఈ నెల 17వ తేదీన రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందుకు గాను ఇప్పటికే ప్రభుత్వం రూ.9వేల కోట్ల నిధులను సమకూర్చుకుంది. అయితే ఎన్నికల ముందే ఈ నిధులు విడుదల చేయాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడినట్టు తెలుస్తోంది.
అయితే మున్సిపల్ ఎన్నికల ప్రచారం సమయంలోనే త్వరలో రైతు భరోసా నిధులను విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నెల 4న మిర్యాలగూడలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత రైతుల ఖాతాల్లో రూ.9వేల కోట్ల రైతు భరోసా నిధులు జమ చేస్తామని అన్నారు. తాజాగా ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడడంతో చెప్పినట్టుగానే రైతు భరోసా విడుదలకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అన్నీ అనుకున్నట్టు జరిగతే ఈ నెల 17న రైతు భరోసా నిధులు విడుదల కానున్నట్టు తెలుస్తోంది.
ఇదే అంశంపై శనివారం సాయంత్రం 6 గంటలకు జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మంత్రులతో రేవంత్ రెడ్డి సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో రైతు భరోసా అంశంతో పాటు ZPTC, MPTC ఎన్నికలపైనా చర్చిలు జరగనున్నట్టు సమాచారం అందుతుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.