హైదరాబాద్, జులై 2: రైల్వేశాఖ ఆధ్వర్యలో ఇటీవల నిర్వహించిన లోకో పైలట్ 2024 సీబీటీ 2 (RRB ALP) పరీక్షల ఫలితాలు బుధవారం (జులై 2) విడుదలయ్యాయి. ఈ పరీక్షలు రాసిన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసి ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. రైల్వేశాఖ ఆన్‌లైన్‌లో మార్చి 19, మే 2, 6వ తేదీల్లో నిర్వహించిన ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థుల హాల్‌టికెట్ నంబర్‌లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
ఆర్‌ఆర్‌బీ లోకో పైలట్ సీబీటీ 2 ర్యాంకు కార్డు డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అభ్యర్ధుతు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి స్కోర్‌కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. స్కోర్ కార్డులు జులై 2 నుంచి 7వ తేదీ వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే లోకోపైలట్ సీబీటీ 2 పరీక్షకు సంబంధించిన కటాఫ్ మార్కులను కూడా అందుబాటులో ఉంచింది. ఓపెన్ కేటగిరీకి 62.96297, ఎస్సీ కేటగిరీకి 30, ఎస్టీ 35.18519, ఓబీసీ కేటగిరీకి 50.37037, ఈడబ్ల్యూఎస్ 42,59259, ఎక్స్ సర్వీస్‌మెన్ 47.77778 మార్కులను అర్హత మార్కులుగా నిర్ణయించారు. ఇందులో అర్హత సాధించిన వారికి జులై 15న ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహించనున్నట్లు ఆర్‌ఆర్‌బీ వెల్లడించింది. కాగా వివిధ రైల్వే జోన్లలో 18,799 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి ఆర్‌ఆర్‌బీ నియామక ప్రక్రయి చేపట్టింది. మొత్తం పోస్టుల్లో సికింద్రాబాద్ రైల్వే జోన్‌లో 2,528 వరకు పోస్టులు ఉన్నాయి.
ఆర్‌ఆర్‌బీ లోకో పైలట్ సీబీటీ 2 అర్హత సాధించిన వారి జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఆన్సర్ కీ వచ్చేసిందోచ్.. డైరెక్ట్ లింక్ ఇదే
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (ఎన్‌టీపీసీ) గ్రాడ్యుయేట్ పోస్టులకు సంబంధించి స్టేజ్ 1 ఆన్‌లైన్ రాత పరీక్షలు ఇటీవల పూర్తైన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీ RRB తాజాగా విడుదల చేసింది. ఆన్సర్ కీతోపాటు అభ్యర్ధుల ప్రశ్నపత్రం, రెస్పాన్స్‌షీట్‌లను వెబ్‌సైట్‌లో పొందుపరించింది. అభ్యర్థులు ప్రాథమిక కీపై అభ్యంతరాను తెలిపేందుకు జులై 6వ తేదీ వరకు అవకాశం ఇచ్చింది. అభ్యంతరాలు తెలిపేవారు రూ.50 చెల్లించి ఆన్‌లైన్ విధానంలో సరైన ఆధారాలతో తెల్పవల్సి ఉంటుంది. కాగా ఆర్‌ఆర్‌బీ దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో మొత్తం 11,558 ఖాళీల భర్తీకి నియామక ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో మొత్తం గ్రాడ్యుయేట్ పోస్టులు 8,113, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు 3,445 వరకు ఉన్నాయి.
ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఆన్సర్ కీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.