టీమిండియా సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్ట్.. ఇప్పటికే టీ20, టెస్టులకు వీడ్కోలు పలికారు. వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. 2027 వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని, కింగ్ కోహ్లీ, రోహిత్ శర్మ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించలేదు. వారు రిటైర్మెంట్ ప్రకటించనప్పటికీ.. రాబోయే వన్డే ప్రపంచ కప్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు అవకాశం లభించదనే వాదనలు వినిపిస్తున్నాయి. రోహిత్ శర్మకు 2027 నాటికి 40 ఏళ్లు నిండుతాయి. విరాట్ కోహ్లీకి 38 ఏళ్లు ఉంటాయి. అందువల్ల వారిద్దరినీ వన్డే ప్రపంచ కప్‌కు పరిగణించే అవకాశాలు తక్కువ ఉన్నట్లు తెలుస్తోంది.
రోహిత్, కోహ్లీ మరో ఏడాది పాటు వన్డే క్రికెట్లో కొనసాగాలంటే.. దేశీయ టోర్నమెంట్లో ఆడాలని నిపుణులు సూచిస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎలాంటి మ్యాచ్‌లు ఆడలేదు. అందువల్ల, వారు వన్డే సిరీస్‌కు ముందు విజయ్ హజారే టోర్నమెంట్ ఆడవలసి ఉంటుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
రోహిత్ , కోహ్లీ విజయ్ హజారే టోర్నమెంట్లో ఆడితేనే వన్డే జట్టుకు ఎంపిక కోసం పరిగణించే ఛాన్స్ ఉంటుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అందువల్ల హిట్‌మ్యాన్, కింగ్ కోహ్లీ టీమిండియాలోకి రీఎంట్రీ వచ్చే ముందు దేశీయ వన్డే టోర్నమెంట్ ఆడవలసి ఉంటుంది. ఆడడమే కాకుండా సత్తా చాటాల్సి ఉంటుంది.
విజయ్ హజారే టోర్నమెంట్లో రోహిత్, కోహ్లీ విఫలమైతే.. వారికి వన్డే జట్టులో అవకాశం లభించడం సందేహమే. ఎందుకంటే భారత జట్టులో ఛాన్స్ కోసం చాలా మంది యువ ఆటగాళ్ళు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా 2027 వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని యువ జట్టుతో కూడిన జట్టును ఏర్పాటు చేయాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ కూడా నిర్ణయించింది.
అందువల్ల రోహిత్, కోహ్లీ తప్పక తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. దీని ప్రకారమే. రాబోయే వన్డే సిరీస్‌కు వారిని ఎంపిక చేసుకోవచ్చు. 2027 వన్డే ప్రపంచ కప్‌లో ఉండాలని ఆశిస్తున్న రోహిత్, కోహ్లీలకు బీసీసీఐ కొత్త టాస్క్‌లు ఇవ్వాలని నిర్ణయించింది. వారు తమ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తేనే జట్టులో అవకాశం లభిస్తుందని స్పష్టమైన సందేశాన్ని పంపుతోంది.