Rohit – Kohli: ‘టీ20 ప్రపంచకప్ 2026 బరిలో రోహిత్, కోహ్లీ జిరాక్స్‌లు.. 3వ ట్రోఫీ తెచ్చేది ఈ ఇద్దరే’

Rohit – Kohli: ‘టీ20 ప్రపంచకప్ 2026 బరిలో రోహిత్, కోహ్లీ జిరాక్స్‌లు.. 3వ ట్రోఫీ తెచ్చేది ఈ ఇద్దరే’


Who Replaced Rohit Sharma and Virat Kohli in Team Indias T20I Squad: ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 ఫిబ్రవరి 7 నుంచి మొదలుకానుంది. ఈ మెగా టోర్నీ కోసం భారత జట్టుతో సహా అన్ని దేశాలు తమ సన్నాహాలలో బిజీగా మారిపోయాయి. ఈ క్రమంలో సునీల్ గవాస్కర్ ఈ ప్రపంచ కప్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ స్థానంలో ఇద్దరు ఆటగాళ్లను చేర్చారు. ఈ లిస్ట్ లో ఎవరున్నారో ఓసారి చూద్దాం..

సునీల్ గవాస్కర్ ఏమన్నారంటే..?

2024 ఐసీసీ టీ20 ప్రపంచ కప్ తర్వాత, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీ20 అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఇద్దరు దిగ్గజాలకు ప్రత్యామ్నాయంగా చాలామందిని అనుకున్నారు. కానీ తాజాగా ఈ ఇద్దరు ఆటగాళ్ళు టీమిండియాలో రోహిత్, కోహ్లీ స్థానంలో శాశ్వతంగా స్థిరపడ్డారు.

ఈ క్రమంలో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. ఇలాంటి ఆటగాళ్లను భర్తీ చేయడం అంత సులభం కాదు. వీరికి ప్రత్యామ్యాయలను పరిశీలిస్తే, రోహిత్ శర్మ స్థానంలో అభిషేక్ శర్మ, విరాట్ కోహ్లీ స్థానంలో ఇషాన్ కిషన్ సరిగ్గా సెట్ అవుతారు. రవీంద్ర జడేజా స్థానంలో అక్షర్ పటేల్ వచ్చాడు. ఈ ఆటగాళ్ళు భిన్నంగా ఉండవచ్చు, కానీ వారి ప్రదర్శన ఆధారంగా, ఈ దిగ్గజాలకు బెస్ట్ ప్రత్యామ్నాయాలుగా నిరూపితమయ్యారు. మన అభిమానులు ఖచ్చితంగా ఆ ముగ్గురు గొప్ప ఆటగాళ్లను మిస్ అవుతారు. కానీ వారిని ఈ ముగ్గురిలో చూస్తే మిస్ అవుతారని నేను అనుకోను’ అంటూ చెప్పుకొచ్చాడు.

రోహిత్, విరాట్ లేకపోయినా టీ20ల్లో టీమిండియా నంబర్ వన్ స్థానంలోనే..

2024 టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడం గమనార్హం. రవీంద్ర జడేజా కూడా టీ20 అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే, ఈ ముగ్గురు అనుభవజ్ఞులు లేకపోయినా, టీమిండియా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానంలో ఉంది. 2026లో వరుసగా రెండో టైటిల్‌ను గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఫిబ్రవరి 7న జరిగే తొలి మ్యాచ్‌లో టీమిండియా అమెరికాతో తలపడనుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *