Robert Kiyosaki: బంగారం vs వెండి.. దేనిపై పెట్టుబడి పెట్టాలి? రాబర్ట్‌ కియోసాకి ఛాయిస్‌ ఏదంటే..?

Robert Kiyosaki: బంగారం vs వెండి.. దేనిపై పెట్టుబడి పెట్టాలి? రాబర్ట్‌ కియోసాకి ఛాయిస్‌ ఏదంటే..?


బంగారం, వెండి ధరలు భారీగా పెరగడంతో చాలా మంది మరింత పెరుగుతాయనే ఆలోచనతో వాటిపై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరి నిజంగానే బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతాయా? వాటిపై పెట్టుబడి పెట్టడం మంచిదేనా? దేనిపై పెట్టుబడి పెడితే మంచిది? అనే అంశాలపై రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి తన అభిప్రాయలను చాలా స్పష్టంగా పంచుకున్నారు. ఆయన చాలా కాలంగా బిట్‌కాయిన్‌పై పెట్టుబడి పెడుతూ, ఇతరులను కూడా పెట్టుబడి పెట్టాలని కోరారు.

కానీ ఇటీవలి నెలల్లో ఆయన వెండి వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతోందని, ద్రవ్యోల్బణం, డాలర్ బలహీనత, రుణ భారం భవిష్యత్తులో పెద్ద ఆర్థిక షాక్‌కు దారితీయవచ్చని కియోసాకి అభిప్రాయపడ్డారు. ఆయన ప్రకారం.. బంగారం, బిట్‌కాయిన్‌లతో పోలిస్తే వెండి ఇప్పటికీ తక్కువగానే ఉంది. పారిశ్రామిక డిమాండ్, సౌరశక్తి, విద్యుత్ వాహనాల వినియోగం పెరుగుతున్నప్పటికీ, వెండి ధరలు బంగారం, క్రిప్టో లాగా పెరగలేదు. అందుకే కియోసాకి వెండి తదుపరి పెద్ద అవకాశంగా మారుతుందని నమ్ముతున్నాడు.

ఫియట్ కరెన్సీలపై నమ్మకం తగ్గిపోతుందని, పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తుల వైపు మొగ్గు చూపుతారని కియోసాకి పదే పదే హెచ్చరిస్తున్నారు. అటువంటి సందర్భంలో రిస్క్‌లను అర్థం చేసుకుని చర్యలు తీసుకుంటే, రిటైల్ పెట్టుబడిదారులకు వెండి ప్రత్యామ్నాయ, సమతుల్య పెట్టుబడి ఎంపికగా ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *