Headlines

Rewind: 2 ఇన్నింగ్స్‌లలో 506 పరుగులు.. 52 ఫోర్లు, 24 సిక్సర్లతో ఉగ్రరూపం.. టీ20ల్లో తోపు మ్యాచ్

Rewind: 2 ఇన్నింగ్స్‌లలో 506 పరుగులు.. 52 ఫోర్లు, 24 సిక్సర్లతో ఉగ్రరూపం.. టీ20ల్లో తోపు మ్యాచ్


క్రికెట్‌లో ఓ రికార్డు క్రియేట్ అయిందంటే.. కచ్చితంగా ఆ రికార్డును మరొకరు బద్దలు కొడతారు. టెస్టు, వన్డే, టీ20 ఇలా ఫార్మటు ఏదైనా సరే.. బ్యాటర్లు ఊచకోత మొదలుపెడితే.. పెను విధ్వంసం మాములుగా ఉండదు మరి. మరి అలాంటి ఓ టీ20 గేమ్ గురించి ఇప్పుడు తెలుసుకుందామా.. ఈ మ్యాచ్ జరిగి రెండేళ్లు అవుతోంది. ఈ టీ20 మ్యాచ్ డొమెస్టిక్ క్రికెట్‌లో జరిగినప్పటికీ.. టీ20ల్లో వరల్డ్ రికార్డు క్రియేట్ అయింది. అలాగే డొమెస్టిక్ క్రికెట్‌లో మూడు రికార్డులు బద్దలయ్యాయి.

మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే.. ఇంగ్లాండ్ వైటాలిటీ బ్లాస్ట్‌లో భాగంగా సర్రే, మిడిల్‌సెక్స్ మధ్య ఈ టీ20 మ్యాచ్ జరిగింది. 2023, జూన్ 22న ఓవల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ ఇరు జట్ల మధ్య హోరాహోరీగా సాగింది. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన సర్రే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 252 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ బ్యాటర్ విల్ జాక్వెస్ 45 బంతుల్లో 96 పరుగులు బాదేశాడు. అంతేకాదు మిడిల్‌సెక్స్ బౌలర్ ల్యూక్ హాల్‌మన్ వేసిన ఓ ఓవర్‌లో జాక్వెస్ వరుసగా 5 సిక్సర్లు కొట్టాడు. అటు మరో ఓపెనర్ ఇవాన్స్ 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 85 పరుగులు చేశాడు. ఇంతటి విధ్వంసం సృష్టించినా.. సర్రే జట్టు చివరికి ఓటమిపాలైంది.

ఇక 253 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో బరిలోకి దిగిన మిడిల్‌సెక్స్‌ 4 బంతులు మిగిలి ఉండగానే.. 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. కెప్టెన్ స్టీఫెన్ ఎస్కినాజీ 39 బంతుల్లో 73 పరుగులు, మిడిలార్డర్ బ్యాటర్ మాక్స్ హోల్డెన్ 35 బంతుల్లో 68 పరుగులు చేసి.. ఈ వరల్డ్ రికార్డు రన్ చేజ్‌లో కీలక పాత్రలు పోషించారు. వైటాలిటీ బ్లాస్ట్‌లో ఇది హయ్యస్ట్ రన్ చేజ్ కాగా.. టీ20 క్రికెట్‌‌లోనే సెకండ్ హయ్యస్ట్‌గా నిలిచింది. అలాగే బ్లాస్ట్‌లో హయ్యస్ట్ స్కోర్, అటు ఒక టీం వ్యక్తిగత హయ్యస్ట్ స్కోర్ కూడా ఇదే కావడం విశేషం. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఆ ఇయర్ వైటాలిటీ బ్లాస్ట్‌లో మిడిల్‌సెక్స్ ఈ మ్యాచ్ ముందు ఆడిన 10 మ్యాచ్‌లలోనూ ఓడిపోయింది. ఈ మ్యాచ్‌తోనే తన ఖాతా తెరిచింది.

ఇది చదవండి: ఇదేం అరాచకం మావ.! గిల్‌కి ఎసరుపెట్టిన హార్దిక్ ఫ్రెండ్.. 600 పరుగులు కొట్టినా డమ్మీనే

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *