Renu Desai: ‘స్టుపిడ్ పొలిటీషియన్స్’.. వారిని ఉద్దేశించి రేణూ దేశాయ్ ఘాటు వ్యాఖ్యలు.. అసలు ఏం జరిగిందంటే?

Renu Desai: ‘స్టుపిడ్ పొలిటీషియన్స్’.. వారిని ఉద్దేశించి రేణూ దేశాయ్ ఘాటు వ్యాఖ్యలు.. అసలు ఏం జరిగిందంటే?


సినిమాలకు దూరంగా ఉంటోన్న రేణూ దేశాయ్ సామాజిక సేవా కార్యక్రమాల్లో మాత్రం చురుగ్గా ఉంటున్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్న పిల్లల పట్ల తన గొంతు విప్పుతుంటారు. అలాగే మూగ జీవాల పట్ల ప్రేమాభిమానులు చూపిస్తుంటారు. అలాగే పలు సామాజిక సమస్యలపై సోషల్ మీడియా వేదికగా ఇన్ స్పైరింగ్ పోస్టులు షేర్ చేస్తుంటారు. తాజాగా ఈ అందాల తార సోషల్ మీడియాలో ఒక సంచలన పోస్ట్ పెట్టారు. అందులో ఆమె రాజకీయ నాయకులను ఘాటుగా విమర్శించారు. ‘స్టుపిడ్ పొలిటీషియన్స్’ అంటూ రేణూ దేశాయ్ షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ లోని సరిస్కా టైగర్ రిజర్వ్‌ లో మైనింగ్ చేయాలని కొంత మంది రాజకీయ నాయకులు ప్రయత్నిస్తున్నారన్నాట. అందుకు ప్రభుత్వం కూడా వత్తాసు పలుకుతోందట. ఈ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఒకప్పుడు ఒకప్పుడు 3 పులులు మాత్రమే ఉండేవట. ఇప్పుడు వాటి సంఖ్య 50కు పైగా చేరిందట. అలాంటి చోట మైనింగ్ ను చేపట్టి మూగ జీవాలను ఎక్కడికి తరిమేస్తారు? లేదా చంపేస్తారా? అంటూ జంతు ప్రేమికులు ఆందోళనలు చేపడుతున్నారు.

ఈ క్రమంలోనే రేణూ దేశాయ్ కూడా ఇదే అంశంపై కొంచెం ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఇన్ స్టా గ్రామ్ స్టోరీస్ లో ఒక పోస్ట్ పెట్టారు. ‘ ఈ రాజకీయ నాయకులను చూస్తుంటే నిజంగా స్టుపిడ్స్ అనిపిస్తుంటుంది. చివరకు వన్య మృగాలను చంపే వరకు కూడా వీళ్లు ఆగేలా కనిపించడం లేదు. చివరి చెట్టును నరికే వరకు నిద్రపోయేలా కనిపించడం లేదు. ఆ పొలిటీషియన్లకు కూడా కొడుకులు, కూతుర్లు, మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారని తెలియదా? వారు కూడా ఇదే భూమ్మీద జీవించాల్సి ఉంటుందన్న విషయం అర్థం కావడం లేదా? ‘ అని ఘాటుగా రియాక్ట్ అయ్యారు రేణూ దేశాయ్.

ఇవి కూడా చదవండి

రేణూ దేశాయ్ లేటెస్ట్ ఫొటోస్..

ప్రస్తుతం ఈ నటి షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. సినీ అభిమానులు, నెటిజన్లు రేణూ దేశాయ్ కు మద్దతుగా నిలుస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

చిక్ బళ్లాపూర్ లోని ఆది యోగి విగ్రహం వద్ద రేణూ దేశాయ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *