ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఎమోషనల్ బాండింగ్ మొదలయ్యేది అమ్మతోనే. అది లవ్ రిలేషన్‌షిప్ కాకపోయినా.. ప్రేమను ఎలా పంచుకోవాలి, ఎవరితో క్లోజ్‌గా ఉండాలి అనే ఫస్ట్ లెసన్స్ మనకి నేర్పేది ఆ అనుబంధమే. ఈ బాండింగ్ మన ఫ్యూచర్ లవ్ రిలేషన్‌షిప్స్‌కి ఒక బలమైన పునాది వేస్తుంది. మనం ఎలా రియాక్ట్ అవుతాం, ఎలా లవ్ చేస్తాం, ఎలాంటి పార్ట్‌నర్‌ను కోరుకుంటాం అనేది ఈ అనుభవాల మీదే ఆధారపడి ఉంటుంది.
ప్రేమ కోసం.. మిమ్మల్ని మీరు మార్చుకోకండి
చిన్నతనంలో మీరు ప్రేమను పొందడం కోసం మంచిగా ప్రవర్తించడమో లేదా ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోవడమో చేసి ఉంటే.. మీరు పెద్దయ్యాక కూడా అదే పద్ధతిలో ప్రేమను పొందాలని అనుకోవచ్చు. దీని వల్ల మీ రిలేషన్‌షిప్స్‌లో మీరు అవసరాల కంటే ఎక్కువ ఇస్తూ.. మీ పార్ట్‌నర్‌కి నచ్చడానికి మీ అవసరాలను పక్కన పెట్టే ఛాన్స్ ఉంది.
నిజమైన భావాలను దాచడం
మీ అమ్మ ఎమోషన్స్ బయటపెట్టడం లేదా జెండర్ డిఫరెన్సెస్ విషయంలో స్ట్రిక్ట్‌గా ఉంటే.. మీరు చిన్నప్పుడే మీ నిజమైన పర్సనాలిటీని దాచిపెట్టి ఉండొచ్చు. దాని వల్ల మీరు పెద్దయ్యాక కూడా మీ రియల్ ఫీలింగ్స్ బయటపెట్టడానికి భయపడతారు.
నమ్మకం లేకపోవడం
మీ అమ్మతో ఉన్న బంధంలో నిర్లక్ష్యం, విమర్శలు లేదా మోసం లాంటివి ఉంటే.. మీరు పెరిగిన తర్వాత మీ లవ్ రిలేషన్‌షిప్స్‌లో ఓపెన్‌గా ఉండటం కష్టంగా అనిపించవచ్చు. క్లోజ్‌గా ఉండటం మీకు ఇబ్బందిగా మారొచ్చు.
ఎమోషనల్ అటాచ్‌మెంట్ లోపించడం
కొన్ని ఫ్యామిలీస్‌లో అమ్మ పిల్లలతో ఎక్కువగా ఎమోషనల్ బాండ్ ఏర్పరచినప్పుడు.. ఆ పిల్లలు అమ్మకు ఒక పార్ట్‌నర్‌లా మారిపోతారు. దీని వల్ల వాళ్ళకి యూత్‌లో లవ్ రిలేషన్‌షిప్స్‌లో క్లారిటీ ఉండదు. వేరే వాళ్ళతో క్లోజ్‌గా ఉండటానికి భయపడతారు లేదా దూరంగా ఉంటారు.
అమ్మ మాట కోసం
మీ అమ్మ చాలా కంట్రోలింగ్ పర్సన్ అయితే.. ఆమెకి ఇష్టం లేని వ్యక్తిని ప్రేమించడానికి మీరు ట్రై చేసినప్పుడు.. గిల్ట్‌తో ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీ ఎంపికలపై మీరు స్ట్రాంగ్‌గా నిలబడలేక అనవసరంగా బాధపడవచ్చు.
పాత ఎమోషనల్ పాటర్న్స్‌ని రిపీట్ చేయడం
చాలా మంది చిన్నప్పుడు అలవాటైన అమ్మతో ఉన్న బంధం లాంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తులను పార్ట్‌నర్‌గా ఎంచుకోవడానికి ఇష్టపడతారు. ఎందుకంటే అది వారికి సేఫ్‌గా అనిపించడంతో పాటు పరిచయంగా ఉంటుంది. కానీ ఇది నిజమైన ప్రేమ కాదు. ఇది కేవలం మనకు తెలిసిన లవ్ ఫీలింగ్‌ను మళ్లీ అనుభవించాలన్న కోరిక మాత్రమే కావచ్చు.
పాత బంధాల నుండి కొత్త ప్రేమ వైపు
ప్రేమలో మీరు ఎదుర్కొంటున్న చాలా సమస్యలకు కారణం మీ అమ్మతో ఉన్న బంధమే కావచ్చు. కానీ అది మీ భవిష్యత్తును పూర్తిగా నిర్ణయించదు. ఆ పాత అలవాట్లను మీరు అర్థం చేసుకున్నప్పుడు.. కొత్తగా, ఆరోగ్యకరమైన సంబంధాలను ఏర్పరచుకోగలుగుతారు. నిజమైన ప్రేమ అంటే.. మిమ్మల్ని మీరు పూర్తిగా అంగీకరించే భాగస్వామితో ఉండటమే. అప్పుడు మాత్రమే మీరు బలంగా ప్రేమించగలరు, ప్రేమను పంచుకోగలరు.