Red Banana: కమలాపూర్ ఎర్ర అరటి వల్ల ఎన్ని లాభాలో తెలుసా … ?

Red Banana: కమలాపూర్ ఎర్ర అరటి వల్ల ఎన్ని లాభాలో తెలుసా … ?


కర్ణాటకంలోని కలబురిగి జిల్లా కమలాపూర్ ప్రాంతంలో పండే మలాపూర్ ఎర్ర అరటికి 2009లో జి.ఐ (Geographical Indication) గుర్తింపు లభించింది. దీంతో ఈ అరటి కమలాపూర్ ప్రాంతానికి ప్రత్యేకతగా అధికారిక గుర్తింపు పొందింది. అయితే, ప్రస్తుతం ఈ అరటి సాగు ముప్పు ఎదుర్కొంటోందని కర్ణాటక ప్రభుత్వం భావిస్తోంది. కలబురిగి జిల్లాలో ఈ అరటి సాగు ఇప్పుడు కేవలం 40 ఎకరాల లోపు మాత్రమే జరుగుతోంది. భవిష్యత్తులో దీనిలో ఇంకా తగ్గుదల వచ్చే అవకాశం ఉన్నందున ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోంది. కర్ణాటక ప్రభుత్వం ఈ అరటిలో ఉన్న అధిక విలువైన బయోమాలిక్యూల్స్ ఆధారంగా పలు ఉత్పత్తులు అభివృద్ధి చేయాలని భావిస్తోంది. ఎర్ర అరటికి ప్రత్యేకంగా ఎరుపు తొక్క ఉంటుంది. లోపల తీపి గుజ్జు చాలా పోషక విలువలు కలిగి ఉంటుంది. ఇందులో ఇనుము, పొటాషియం, విటమిన్ B6 ఎక్కువగా ఉండడంతో రక్తహీనతతో బాధపడేవారికి ఇది ప్రయోజనకరం. అలాగే మధుమేహం, జీర్ణ సమస్యల ఉన్నవారికి కూడా ఇది ఉపశమనం కలిగిస్తుందని వైద్యులు సూచిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎర్ర అరటిలోని బయోమోలిక్యూల్స్ ఉపయోగించి ఔషధాలు, హెల్త్ సప్లిమెంట్స్, పౌడర్లు, క్యాప్సూల్స్ వంటి ఆరోగ్య ఉత్పత్తులను తయారు చేయాలనుకుంటోంది. తద్వారా రైతులకు ఈ పంట ద్వారా మరింత ఆదాయం కల్పించడమే లక్ష్యం. సాధారణ అరటితో పోలిస్తే ధర ఎక్కువగా ఉండటం వల్ల తెలుగురాష్ట్రాల్లో ఈ అరటి అందుబాటులో ఉన్నా, ఎక్కువ మంది ఆసక్తి చూపడం లేదు. అయితే పోషక విలువలు తెలిసిన వారు మాత్రం ఈ కమలాపూర్ ఎర్ర అరటిని తమ ఆహారంలో భాగం చేసుకుంటున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *