Real vs Fake Rudraksha: నకిలీ రుద్రాక్షలకు ఆముదంతో చెక్.. మీ దగ్గరున్న ఏకముఖి ఒరిజినలో కాదో చిటికెలో తేల్చేయండి..

Real vs Fake Rudraksha: నకిలీ రుద్రాక్షలకు ఆముదంతో చెక్.. మీ దగ్గరున్న ఏకముఖి ఒరిజినలో కాదో చిటికెలో తేల్చేయండి..


ప్రస్తుత కాలంలో రుద్రాక్షలకు ఉన్న డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని మార్కెట్‌లో అనేక నకిలీ రుద్రాక్షలు దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా ఏకముఖి రుద్రాక్ష విషయంలో మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే దీనిని ధరించే ముందు అది అసలైందో కాదో పరీక్షించుకోవడం చాలా ముఖ్యం. అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరైనా దీనిని ధరించవచ్చా? ఏ రాశి వారికి ఇది ఎక్కువ ప్రయోజనకరం? ఆరోగ్య పరంగా దీని విశిష్టత ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఏకముఖి రుద్రాక్ష – విశిష్ట ప్రయోజనాలు:

మోక్ష సాధనం: ఏకముఖి రుద్రాక్ష ధరించిన వారు భగవంతుడికి చేరువవుతారు. ఇది మోక్షప్రాప్తికి ఉత్తమ సాధనంగా పరిగణించబడుతుంది.

సూర్య గ్రహ దోష నివారణ: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రుద్రాక్ష సూర్యుడితో సంబంధం కలిగి ఉంటుంది. ఎవరి జాతకంలోనైనా సూర్యుడు బలహీనంగా ఉంటే, దీనిని ధరించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా సింహరాశి వారికి ఇది చాలా మంచిది.

ఆరోగ్య ప్రయోజనాలు: బ్లడ్ ప్రెషర్ (రక్తపోటు), గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారికి ఇది మేలు చేస్తుంది. అంతేకాకుండా వ్యక్తిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది.

కెరీర్ విద్య: విద్యార్థులు ఏకముఖి రుద్రాక్ష ధరిస్తే ఏకాగ్రత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి, ధనలాభం కలగడానికి ఇది తోడ్పడుతుంది.

అసలైన రుద్రాక్షను గుర్తించడం ఎలా?

ఆముదం నూనె పరీక్ష: రుద్రాక్షను ఆముదం నూనెలో వేసినప్పుడు, అది అంతకుముందు ఉన్న రంగు కంటే మరింత ప్రకాశవంతంగా కనిపిస్తే అది అసలైనదిగా భావించవచ్చు.

వేడి నీటి పరీక్ష: రుద్రాక్షను వేడి నీటిలో వేసి మరిగించినప్పుడు రంగు పోతే అది నకిలీదని అర్థం. రంగు మారకుండా ఉంటేనే అది నిజమైన రుద్రాక్ష.

ధారల గుర్తింపు: ఏకముఖి రుద్రాక్షలో ఒకే ఒక సహజసిద్ధమైన ధార (లైన్) ఉంటుంది. దీనిని జాగ్రత్తగా పరిశీలించాలి.

గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. రుద్రాక్షను ధరించే ముందు అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను లేదా సిద్ధాంతులను సంప్రదించి, వారి సలహా మేరకు ధరించడం శ్రేయస్కరం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *