టాలీవుడ్ ఇండస్ట్రీలో విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన చాలా మంది నటులలో రవికిషన్ ఒకరు. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తన యాక్టింగ్, కామెడీ టైమింగ్ తో గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో సహయ నటుడిగా కనిపిస్తున్న ఆయన.. భోజ్ పురి సినిమా ప్రపంచంలో మాత్రం స్టార్ హీరో. తెలుగుతోపాటు హిందీలోనూ పలు చిత్రాల్లో నటించారు. అల్లు అర్జున్ నటించిన రేసు గుర్రం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసిన రవికిషన్.. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత తెలుగులో కిక్ 2, రాధే, సుప్రీమ్, ఎమ్మెల్యే, లై, సాక్ష్యం, హీరో ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. అటు విలన్ గా, ఇటు సహయ నటుడిగా నటించారు. ఇటీవలే బాలయ్య నటించిన డాకు మహారాజ్ చిత్రంలో విలన్ పాత్రలో నటించారు.
ఇవి కూడా చదవండి: Mahesh Babu : కాలేజీలో మహేష్ బాబు బెస్ట్ ఫ్రెండ్.. ఇప్పుడు ఇండస్ట్రీలో తోపు హీరోయిన్..
ఇవి కూడా చదవండి
ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూనే .. అటు రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నారు. మొదట కాంగ్రెస్ పార్టితో రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేసిన ఆయన.. 2017లో బీజేపీలో చేరారు. 2019 సాధారణ ఎన్నికల్లో గోరఖ్ పూర్ ఎంపీగా విజయం సాధించారు. ఇక 2024 జనరల్ ఎలక్షన్లలో మరోసారి గెలిచారు. ఇదిలా ఉంటే.. 1993లో ప్రీతిశుక్లాను పెళ్లి చేసుకున్నారు రవికిషన్. ఈ దంపతులకు నలుగురు సంతానం. ఒక అబ్బాయి, ముగ్గురు అమ్మాయిలు.
ఇవి కూడా చదవండి: Kamal Haasan: అప్పుడు చిన్న హీరోయిన్.. ఇప్పుడు కమల్ హాసన్తోనే.. ఎవరో గుర్తుపట్టారా.. ?
ప్రస్తుతం రవికిషన్ కూతురు ఆర్మీలో చేరి దేశానికి సేవలు అందిస్తుంది. ఇక మరో కూతురు తండ్రిలాగే సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఆమె పేరు రివా కిషన్. 2015లో దిగ్గజ నటుడు నసీరుద్దీన్ షా కుమార్తె హీబాతో కలిసి పరిందో కి మెహ్ఫిల్ చిత్రంలో నటించింది. 2016లో ముంబైలోని టెరెన్స్ లూయిస్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ లో డ్యాన్స్ ట్రైనింగ్ తీసుకుంది. 2022లో సబ్ కుశల్ మంగల్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఫస్ట్ మూవీతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. ఇక ఇప్పుడు ఈ అమ్మడు సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది.
ఇవి కూడా చదవండి: Tollywood: ఉదయం లేవగానే ముఖానికి ఉమ్మీ రాసుకుంటాను.. స్టార్ హీరోయిన్ బ్యూటీ సీక్రెట్.. ఫ్యాన్స్ షాక్..
ఇవి కూడా చదవండి: Pawan Kalyan: ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ బెస్ట్ ఫ్రెండ్.. ఎవరో గుర్తుపట్టారా.. ?