రణబీర్ రాముడిగా, యష్ రావణుడిగా… నితేష్ తివారి 'రామాయణ' అనౌన్స్మెంట్ వీడియో చూసినవాళ్లంతా.. ఐ ఫీస్ట్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆన్లైన్లో ఈ కంటెంట్ ఎప్పుడు రిలీజ్ అయినా గూస్ బంప్స్ గ్యారంటీ అనే మాటలు వైరల్ అవుతున్నాయి.
రామ కథ ఆధారంగా తెరకెక్కుతోంది నితీష్ తివారి రామాయణం. గ్లోబల్ స్టాండర్డ్ సినిమాటిక్ యూనివర్స్‌ను క్రియేట్ చేయాలన్న సంకల్పంతో కృషి చేస్తున్నారు నితేష్ అంటూ ప్రశంసలతో ముంచెత్తుతోంది టీమ్.
'సీతమ్మ తల్లిగా సాయిపల్లవి స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయిదంటున్నారు షో రీల్ చూసినవారు. రామాయణ్ పార్ట్ 1 షూటింగ్ ఆల్రెడీ పూర్తయింది. వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ అవుతుంది. పార్ట్ 2 షూటింగ్ ఆగస్టులో మొదలవుతుంది.
ఫస్ట్ పార్టులో యష్ కనిపించడన్నది వైరల్ న్యూస్. సెకండ్ పార్టులోనే యష్‌కి సంబంధించిన కథ మొత్తం నడుస్తుందట. ఈ ప్రాజెక్ట్ కి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు కేజీయఫ్ స్టార్ బడ్జెట్‌కి ఎక్కడా వెనకాడకుండా తెరకెక్కిస్తున్నారు నమిత్ మల్హోత్రా.
AR రెహ్మాన్ – హాన్స్ జిమ్మర్ సంయుక్తంగా అందిస్తున్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో విజువల్ ఎక్స్ పీరియన్స్ కి మేజికల్ టచ్ గ్యారంటీ అని అంటోంది యూనిట్. ఇంతగా ఊరిస్తున్న విజువల్స్ ని ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు యష్ అండ్ రణ్‌బీర్ ఫ్యాన్స్.