Ram Charan : స్పోర్ట్స్ షెడ్యూల్‌తో బిజీగా పెద్ది మూవీ టీమ్.. రంగంలోకి దిగిన గ్లోబల్ స్టార్..

Ram Charan : స్పోర్ట్స్ షెడ్యూల్‌తో బిజీగా పెద్ది మూవీ టీమ్.. రంగంలోకి దిగిన గ్లోబల్ స్టార్..


Ram Charan : స్పోర్ట్స్ షెడ్యూల్‌తో బిజీగా పెద్ది మూవీ టీమ్.. రంగంలోకి దిగిన గ్లోబల్ స్టార్..

టాలీవుడ్ స్టార్ కపుల్ రామ్ చరణ్, ఉపాసన ఇంట సంబరాల వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. జనవరి 31న రామ్ చరణ్ సతీమణి ఉపాసన కవలలకు జన్మనివ్వడంతో వీళ్ళ కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. క్లిన్ కారాతో పాటు మరో ఇద్దరు చిన్నారులకు ఉపాసన, రామ్ చరణ్ తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. తాజాగా జరిగిన బారసాల వేడుకలో.. పిల్లల పేర్లను శివరామ్, అన్వీరా దేవి అంటూ తెలిపారు రామ్ చరణ్. బారసాల వేడుకకు సంబంధించిన ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ.. పిల్లల పేర్ల అర్థాలను వెల్లడించారు మెగాస్టార్ చిరంజీవి.

ఎక్కువమంది చదివినవి : Jabardasth: జబర్దస్త్ మానేసి తప్పు చేశాను.. మాటలు నమ్మి అలా జరిగింది.. జబర్దస్త్ కమెడియన్..

చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్ నుంచి శివను.. రామ్ చరణ్ నుంచి రామ్‌ను తీసుకుని వారసుడికి శివరామ్ కొణిదెల అని పెట్టారు చరణ్. అలాగే ఇందులో దేవుడి పేర్లు కూడా ఉన్నాయి. మరోవైపు పెద్ద కూతురికి క్లిన్‌కారా అంటూ అమ్మవారి పేరు పెట్టిన చరణ్.. చిన్న కూతురుకు కనక దుర్గ అమ్మవారి ఆశీస్సులతో అన్వీరా దేవి అనే నామకరణం చేసారు. కవల పిల్లల బారసాలకు సంబంధించిన ఫోటోలు వచ్చాయి. ఈ వేడుకలో రామ్ చరణ్ తన కూతురు క్లిన్‌కారాను ఆప్యాయంగా ఎత్తుకోగా.. చిరంజీవి దంపతులు కవల పిల్లలను ఎత్తుకున్నారు. సంప్రదాయ వస్త్రధారణలో, కుటుంబ సభ్యులందరి మధ్య జరిగిన ఈ వేడుక ఎంతో ఆహ్లాదకరంగా సాగింది. ఈ వేడుక ముగియడంతో త్వరలోనే పెద్ది షూటింగ్‌లో జాయిన్ కానున్నారు చరణ్.

ఎక్కువమంది చదివినవి : Actor : సూపర్ స్టార్ కొడుకు.. అయినా అవకాశాలు ఇవ్వలేదు.. ఒక్క సినిమాతో ఇండస్ట్రీనే షేక్ చేశాడు..

ప్రస్తుతం ఈ మూవీ టీమ్ ఏమాత్రం గ్యాప్ లేకుండా షూటింగ్ చేస్తుందట. చిత్రయూనిట్ తోపాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా వేగంగానే జరుగుతుందట. ఇప్పటికే ఫస్ట్ హాఫ్ కంప్లీట్ చేసిన ఈ మూవీ.. ఇప్పుడు మరో షెడ్యూల్ స్టార్ట్ చేసినట్లు టాక్. ప్రస్తుతం డైరెక్టర్ బుచ్చిబాబు అండ్ టీమ్ కుస్తీ పోటీలపై సన్నివేశాలు తీస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో రామ్ చరణ్ లేకుండానే జరుగుతున్నట్లు టాక్. త్వరలోనే చరణ్ షూటింగ్ లో జాయిన్ కానున్నారు.
ఎక్కువమంది చదివినవి : Folk Song : ఏం పాటరా బాబూ.. కుర్రాళ్లు తెగ పాడుతున్న ఫోక్ సాంగ్.. దెబ్బకు యూట్యూబ్‏లో సంచలనంగా మారింది..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *