Ram Charan: రామ్‌చరణ్‌-ఉపాసనలకు ట్విన్స్.. ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్స్.. ఏం పంపించారో తెలుసా? వీడియో

Ram Charan: రామ్‌చరణ్‌-ఉపాసనలకు ట్విన్స్.. ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్స్.. ఏం పంపించారో తెలుసా? వీడియో


మెగా ఫ్యామిలీ లో పండగ వాతావరణం నెలకొంది.ఇటీవల రామ్ చరణ్ సతీమణి ఉపాసన కవల పిల్లలకు జన్మనివ్వడమే ఈ సంతోషానికి కారణమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఉపాసనకు ఒక మగ బిడ్డ, ఆడ బిడ్డ జన్మించడంతో మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు సైతం ఆనందంలో మునిగిపోయారు. ఇప్పటికే ఈ జంటకు క్లీంకార అనే కూతురు పుట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఉపాసనకు ట్విన్స్ జన్మించడంతో ఈ ఆనందం మరింత రెట్టింపైంది. ఈ శుభ సందర్బాన్ని పురస్కరించుకుని రామ్ చరణ్ దంపతులు మెగా అభిమానులకు ఓ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ సంతోషం సమయంలో ఫ్యాన్స్‌కు స్వీట్ బాక్సులు పంపించారు. ఈ మేరకు ఓ అభిమాని గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో రెండు రకాల స్వీట్స్ ఉన్నాయి. ఈ బహుమతిపై రామ్ చరణ్ -ఉపాసనకు అభినందనలు. అపోలో నుంచి ఈ బహుమతి వచ్చిందని క్యాప్షన్ రాశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. కాగా ఉపాసన ట్విన్స్ కు జన్మనివ్వగానే అభిమానులందరూ ఆపోలో ఆస్పత్రి దగ్గరకు భారీగా చేరుకుని హంగామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమను ఎంతగానో అభిమానిస్తోన్న ఫ్యాన్స్ కు స్వీట్ బాక్సులు పంపారు రామ్ చరణ్ దంపతులు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం పెద్ది అనే సినిమాలో నటిస్తున్నాడు రామ్ చరణ్. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తోన్న ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. వీరితో పాటు మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ నటుడు దివ్యేందు త్రిపాఠి, జగపతి బాబు, కమెడియన్ సత్య తదితరులు వివిధ పాత్రలు పోషిస్తున్నారు. ఈ మెగా మూవీకి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన చికిరి సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ మూవీ నుంచి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.

ఇవి కూడా చదవండి

  రామ్ చరణ్-ఉపాసన దంపతులు పంపిన గిఫ్ట్ ను చూపిస్తోన్న అభిమాని.. వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *