దేశం మొత్తం రాఖీ పండగ జరుపుకునే సమయంలో కొన్ని గ్రామాల్లో రాళ్ల వర్షం కురుస్తుంది. అవును ఒక వైపు రక్షా బంధన్ స్వీట్లు, రాఖీ, ప్రేమకు చిహ్నం అయితే, మరోవైపు భారతదేశంలోని కొన్ని గ్రామాల్లో ఇది శక్తి, పోరాటం, సంప్రదాయం ప్రత్యేకమైన కథను కూడా చెబుతుంది. ఉత్తరాఖండ్‌లోని ఖోలి కంద్ మైదానం, మధ్యప్రదేశ్‌లోని మనవర్ ప్రాంతం రెండూ భారతీయ సంస్కృతిలో ఒకే పండుగకు అనేక రూపాలు ఉంటాయని , ప్రతి రూపంలోనూ ఒక సందేశం దాగి ఉంటుందని రుజువు చేస్తున్నాయి.
చంపావత్ లోని ఖోలి కాండ్ మైదానంలో రాతి యుద్ధం
ఉత్తరాఖండ్‌లోని చంపావత్ జిల్లాలోని ఖోలి కాండ్ మైదానంలో రక్షా బంధన్ రోజున రాతి యుద్ధం అనే ప్రత్యేకమైన సంప్రదాయాన్ని పాటిస్తారు.
సంప్రదాయం అంటే ఏమిటి?
రెండు సాంప్రదాయ గ్రామ సమూహాలు ఒకరిపై ఒకరు రాళ్ళు విసురుకుని, కవచాలతో తమను తాము రక్షించుకుంటాయి. ఈ యుద్ధం బాగా ప్రణాళిక చేయబడుతుంది. కాలపరిమితితో కూడుకుని ఉంటుంది. మత విశ్వాసాల పరిధిలో జరుగుతుంది. రాళ్ళతో పోరాటం ముగిసిన తరువాత రెండు గ్రామాలకు చెందిన ప్రజలు దేవతను పూజించి ఐక్యత సందేశాన్ని ఇస్తాయి.
ఇవి కూడా చదవండి
ఈ సంప్రదాయం వెనుక ముడిపడి ఉన్న నమ్మకం ఏమిటి ?
ఈ యుద్ధం శక్తి దేవిని ప్రసన్నం చేసుకోవడానికి, సమాజంలో ధైర్యాన్ని నింపడానికి, ఐక్యతను ప్రదర్శించడానికి చిహ్నంగా నమ్ముతారు. ఈ సంప్రదాయం శతాబ్దాల నాటిదని, ఇప్పుడు ఇది జానపద సాంస్కృతిక పండుగ రూపాన్ని సంతరించుకుందని పెద్దలు నమ్ముతారు.
మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలోని మనవర్ ప్రాంతంలో రాళ్లు రువ్వే సంప్రదాయం
మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ముఖ్యంగా మనవర్, బాగ్, ఝబువా ప్రాంతాలలో రక్షా బంధన్ రోజున రాళ్ళతో యుద్ధం చేసుకునే ప్రత్యేకమైన సంప్రదాయాన్ని కూడా పాటిస్తారు.
సంప్రదాయం అంటే ఏమిటి?
ఈ యుద్ధం రెండు గ్రామాలు లేదా జాతి సమూహాల మధ్య సాంప్రదాయ యుద్ధ శైలిలో జరుగుతుంది. రాళ్ల ఎంపిక కూడా కొన్ని నియమాల ప్రకారం జరుగుతుంది. స్థానిక యువత ఇందులో పాల్గొంటారు. ఈ కార్యక్రమం నాగ దేవతలకు లేదా శక్తి రూపంలో ఉన్న దేవతకు అంకితం చేయబడింది.
దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక కారణాలు
ఈ సంప్రదాయం ద్వారప యుగం నాటిదని.. అర్జునుడు సర్పాల మధ్య జరిగిన యుద్ధానికి ప్రతీక అని.. పురాణ కథలోని యుద్ధాల పునఃరూపకల్పనగా లేదా గ్రామ వివాదాలకు ప్రతీకాత్మక పరిష్కారంగా ఈ రాళ్ళ దాడి నమ్ముతారు.
ఈ సంప్రదాయాలు ఏమి బోధిస్తాయి?
రక్షా బంధన్ కేవలం సోదరులు, సోదరీమణులకే పరిమితం కాదు. ఇది సమిష్టి రక్షణ, బలం, సంస్కృతికి వ్యక్తీకరణ మార్గం కూడా. అయితే ఈ రాళ్ల దాడి సంప్రదాయాల్లో హింస జరగదు. అయితే ప్రతీకాత్మక ధైర్య సాహసాలను ప్రదర్శన ఉంటుంది. ఈ సంప్రదాయం శతాబ్దాల నాటి ఐక్యత, ధైర్యనికి ప్రతీక అని నమ్ముతారు. ఈ కార్యక్రమాల ద్వారా స్థానిక యువత వారి జానపద చరిత్ర, సాంస్కృతిక విలువలతో కనెక్ట్ అవుతారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.