Rakhi Festival: మొక్కతో బంధం.. పర్యావరణ సుగంధం.. వినూత్నంగా రాఖీ పండగను జరుపుకున్న స్కూల్ స్టూడెంట్స్

Rakhi Festival: మొక్కతో బంధం.. పర్యావరణ సుగంధం.. వినూత్నంగా రాఖీ పండగను జరుపుకున్న స్కూల్ స్టూడెంట్స్


మానవ మనుగడకు మొక్కలే జీవనాధారమని అందరికీ తెలుసు. అయినా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే చెట్లను మనిషి అభివృద్ధి పేరిట నరికేస్తున్నారు. అందుకే ప్రకృతి ప్రకోపానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లా కోదాడ ప్రభుత్వ జడ్పీ బాలుర పాఠశాల విద్యార్థులు కూడా రక్షాబంధన్ పండుగను జరుపుకున్నారు. పర్యావరణ పరిరక్షణకు వృక్షాలే కీలకమంటూ.. వృక్షాబంధన్ పేరుతో వినూత్న రీతిలో వేడుకలను నిర్వహించారు. పాఠశాలలో 260 మంది విద్యార్థిని, విద్యార్థులు ఉన్నారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు పాఠశాల ఉపాధ్యాయులు రక్షాబంధన్ ను వినూత్నంగా నిర్వహించారు.

పాఠశాల విద్యార్థులతో పరిసర ప్రాంతాల్లోని మొక్కలు, చెట్లకు రాఖీలు కట్టి రక్షాబంధన్ ను వినూత్నంగా జరుపుకున్నారు. విద్యార్థులే గ్రీన్ టీమ్ ఏర్పడి పాఠశాలలో నాటిన మొక్కలకు సంరక్షణ బాధ్యతలు చేపట్టారు. సీజీఎన్ (కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్) స్వచ్ఛంద సహకారంతో ప్రకృతి ప్రేమికులు, విద్యార్థులు తరలివచ్చి వేడుకను ఉత్సాహంగా జరుపు కున్నారు.

వృక్షాబంధన్‌కు రాఖీ కట్టి ఇటువంటి చెట్లను కాపాడుకుందాం అంటూ ప్రతిజ్ఞ చేశారు. పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే చెట్లను మనిషి అభివృద్ధి పేరి చెట్లు లేకపోతే జరిగే నష్టాన్ని గుర్తించాలని విద్యార్థులు కోరారు. మనిషి ప్రాణాలు నిలిపే, ప్రాణ వాయువును అందించే చెట్లు, మొక్కలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *