Headlines

Rakhi Festival: మీ సోదరుడికి రాఖీకి బదులుగా రక్షణ కవచం కట్టండి.. నారద పురాణం ప్రకారం రక్షని ఎలా తయారు చేయాలంటే..

Rakhi Festival: మీ సోదరుడికి రాఖీకి బదులుగా రక్షణ కవచం కట్టండి.. నారద పురాణం ప్రకారం రక్షని ఎలా తయారు చేయాలంటే..


రాఖీ పండగ అనేది కేవలం ఒక పండుగ కాదు. వేల సంవత్సరాల పురాతన గ్రంథాలలో దాగి ఉన్న శక్తివంతమైన వేద సంప్రదాయం. ఇప్పటివరకు మీరు మార్కెట్లో లభించే రంగురంగుల రాఖీలను మాత్రమే చూసి ఉంటారు. అయితే వేద రాఖీ రహస్యం గురించి మీకు ఎప్పుడైనా తెలుసా? అలాంటి రక్ష సూత్రం, దానిని కట్టిన తర్వాత శ్రీ మహా విష్ణువు స్వయంగా తన సోదరుడికి రక్షకుడిగా మారుతాడు, దేవత కూడా కత్తిరించలేని రక్ష సూత్రం. దీని గురించి భవిష్య పురాణం, నారద పురాణంలో ప్రత్యక్ష ప్రస్తావన ఉంది. ఈ సంప్రదాయం ఇప్పటికీ కొన్ని ప్రదేశాలలో సజీవంగా ఉంది.

భారతీయ పురాణ గ్రంథాలలో రక్షా సూత్రం సోదర-సోదరీమణుల సంబంధానికి మాత్రమే కాదు అన్ని రకాల ప్రతికూలతల నుంచి రక్షణ ఇస్తుందని కూడా ప్రస్తావించబడింది. రాక్షసులతో యుద్ధానికి ముందు దేవతలు గురు బృహస్పతి సలహా మేరకు రక్షా సూత్రాన్ని కట్టారని భవిష్య పురాణం చెబుతోంది. ఈ రక్షా సూత్రాన్ని వేద పద్ధతిలో మంత్రాల ద్వారా తయారు చేసినప్పుడు అది శక్తివంతమైనదిగా మారుతుందని నారద పురాణం వివరిస్తుంది. ఈ సంవత్సరం రాఖీ పండగ రోజున మీ సోదరుడి రక్షణ కోసం మీరు కూడా ప్రత్యేకంగా ఏదైనా చేయాలనుకుంటే.. వేద రాఖీ కంటే మెరుగైనది మరొకటి లేదు. దీనిని తయారుచేసే పద్ధతి కూడా చాలా సులభం. దాని వెనుక ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉంది.

వేద రాఖీ ఎలా తయారు చేయాలంటే

  1. శుభ్రమైన ఎర్రటి వస్త్రం తీసుకోవాలి
  2. ఇప్పుడు అందులో కొన్ని పసుపు ఆవాలు, కొన్ని అక్షతలు వేయండి.
  3. ఇవి కూడా చదవండి

  4. ఇప్పుడు ఆ వస్త్రాన్ని గంగా జలంతో శుద్ధి చేసి.. దానికి ముడి వేయండి.
  5. తరువాత ఈ రక్ష సూత్రాన్ని శ్రీ మహా విష్ణువుకు సమర్పించి.. ఈ మంత్రాన్ని పఠించండి.
  6. “ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
  7. విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం
  8. లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్ధ్యానగమ్యం
  9. వందే విష్ణుం భవభయహరం సర్వ లోకైకనాథం
  10. తర్వాత ఈ రాఖీని మీ సోదరుడి మణికట్టుకు కట్టండి.

ఈ వేద రాఖీ వెనుక ఉన్న శక్తి ఏమిటి?

భవిష్య పురాణం ప్రకారం ఈ రక్ష సూత్రం కేవలం భౌతిక కవచం మాత్రమే కాదు.. ఆధ్యాత్మిక కవచం కూడా అవుతుంది. ఈ వేద రక్ష సూత్రాన్ని మణికట్టు మీద కలిగి ఉన్న వ్యక్తిని విష్ణువు స్వయంగా రక్షిస్తాడు. సోదరీమణులు ఈ రాఖీని సరైన మంత్రాలతో కడితే ఆ సోదరుడుపై ఉన్న చెడు దృష్టి, గ్రహ ప్రభావాలు, వ్యాధులు, శత్రువుల నుంచి రక్షించబడతాడని నారద పురాణం చెబుతోంది.

ఈ సంప్రదాయం నేటికీ సజీవంగా ఉంది

నేటికీ కొన్ని దక్షిణ భారత దేశంలో ప్రాంతాలతో పాటు పూర్వాంచల్ ప్రాంతాలలో సోదరీమణులు రాఖీ కట్టే ముందు మంత్రాలతో రక్ష సూత్రాన్ని పవిత్రం చేస్తారు. ఈ సంప్రదాయం ఇప్పటికీ అనేక గురుకులాలలో, వేదాలను అభ్యసించే బ్రాహ్మణుల ఇళ్లలో సజీవంగా ఉంది. వాస్తవానికి రాఖీ అనేది మొదట రక్షిక అనే పదం నుంచి ఉద్భవించింది. అంటే రక్షణ దారం.

ఈసారి మీరు రాఖీ పండగ కేవలం ఒక ఆచారంగా మాత్రమే కాదు ఆధ్యాత్మిక కవచంగా చేసుకోవాలనుకుంటే.. వేద రాఖీని తయారు చేయడానికి ప్రయత్నించండి. ఇది మీ సోదరుడిని రక్షించడమే కాదు అతి పురాతన ప్రాచీన సంప్రదాయాన్ని సజీవంగా ఉంచినట్లుగా ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *