నైరుతి రుతుపవనాలు దేశమంతా విస్తరించాయి. తెలుగు రాష్ట్రాల్లో మబ్బులు కమ్మేశాయి. దీంతోపాటు.. అరేబియా సముద్రంలో.. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతుండడంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కరిసే అవకాశం కనిపిస్తోంది. ఉత్తరబంగాళాఖాతం, ఆనుకునిఉన్న బంగ్లాదేశ్, పశ్చిమబెంగాల్ తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.. దీని ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. దీని ప్రభావంతో ఆదివారం తెలంగాణలోని 19 జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
ఏపీకి 3 రోజుల పాటు వర్షసూచన
ఉత్తర బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో ఆదివారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. దీని ప్రభావంతో ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, మిగతాజిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందిని చెప్పింది.
అంతేకాకుండా తీరం వెంబడి గంటకు 40-50 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని.. హెచ్చరించింది. మొత్తంగా ఏపీలో వచ్చే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..