Rain Alert: అబ్బ.. వచ్చే 3 రోజులు వర్షాలే వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

Rain Alert: అబ్బ.. వచ్చే 3 రోజులు వర్షాలే వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..


తెలంగాణలో మరోసారి వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్షాలపై కీలక అప్డేట్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది.. రుతుపవన ద్రోణి ఈరోజు ఫిరోజ్పూర్, చండీగర్ అటు పిమ్మట తూర్పు ఈశాన్య దిశలో హిమాలయ పర్వత సానువుల వరకు కొనసాగుతోంది. నిన్న నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు తీరం వద్ద కొనసాగుతున్న ఉపరితల చక్రవాత ఆవర్తనం ఈరోజు అదే ప్రాంతంలో సగటు సముద్ర మట్టం నుండి 1.5 నుండి 3.1 కి మీ ఎత్తులో కొనసాగుతోంది. తూర్పు పశ్చిమ ద్రోణి ఈరోజు కర్ణాటక తీర ప్రాంతం నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక దక్షిణ రాయలసీమ ఉత్తర తమిళనాడు, నైరుతి బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం మీదుగా దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతం వరకు కొనసాగుతోందని వాతావరణ శాఖ పేర్కొంది. నిన్న దక్షిణ మధ్య మహారాష్ట్ర దాని పరిసరాలలో సగటు సముద్రమట్టం నుండి 1.5 కి మీ ఎత్తులో కొనసాగిన ఉపరితల ఆవర్తనం ఈరోజు బలహీన పడిందని తెలిపింది.

రాగల 3 రోజులకు వాతావరణ సూచన:

గురువారం, శుక్రవారం, శనివారం తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు చాలా జిల్లాలలో కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.

గురువారం, శుక్రవారం, శనివారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది..

చాలా జిల్లాలలో ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కి మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు ప్రకటనలో తెలిపారు.

ఏపీకి వర్ష సూచన

ఏపీలో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. రాయలసీమ, ఉత్తర తమిళనాడు మీదుగా ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో శుక్రవారం రాయలసీమలో పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు, మన్యం, అల్లూరి, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి-మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పిడుగుపాటు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

భారీ వర్షాలు..

ఇదిలాఉంటే.. గురువారం నిజామాబాద్‌ సిటీలో ఉరుములు మెరుపులతో కూడిన కుండపోత వర్షం గంటపాటు కుమ్మేసింది. దాంతో.. గౌతమ్‌నగర్, ఆటోనగర్, నాగారం ప్రాంతాల్లో రోడ్లు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో వాతావరణం ఒక్కసారిగా మారింది. మధ్యాహ్నం వరకు ఎండ మిడిసిపడగా.. ఆ తర్వాత ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. కొద్దిరోజులుగా వర్షాలు లేకపోవడంతో పత్తి, వరి, మొక్కజొన్న రైతులు ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో.. ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. భీమిని మండలం చిన్నతిమ్మాపూర్‌లో గాలివాన బీభత్సం సృష్టించింది. దాంతో.. విద్యుత్ స్తంభాలు విరిగిపడగా.. రేకుల షెడ్డులు నేలకూలాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *