Pythons Fight: కొండచిలువల యుద్ధం ఎప్పుడైనా చూశారా.? ఈ వీడియో చూస్తే మీ ప్రాణాలు పోయేంత పనవుతుంది!

Pythons Fight: కొండచిలువల యుద్ధం ఎప్పుడైనా చూశారా.? ఈ వీడియో చూస్తే మీ ప్రాణాలు పోయేంత పనవుతుంది!


వర్షాకాలంలో పాముల బెడద తీవ్రంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో పాములకు నిలయంగా భావిస్తున్నారు. ప్రతి మూడు ఇళ్లలో ఒక ఇంటి పైకప్పులో పైతాన్‌లు దాగి ఉంటాయట. తాజా ఒక ఇంటి చూరు నుంచి రెండు కొండచిలువలు కనిపించాయి. ఒకదానికొకటి భీకర పోరు చేస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇది కాస్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

వానాకాలం వచ్చిదంటే చాలు.. పాములు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంటాయి. ప్రత్యేకించి క్వీన్స్‌లాండ్‌లో కార్పెట్‌ పైథాన్స్‌ ఇంటి చూరుల్లో దాక్కుని ఉంటాయి. ఈ క్రమంలోనే రెండు మగ కొండచిలువలు ఇంటి పైకప్పు నుండి వేలాడుతూ ఫైట్‌ చేసుకుంటున్న ఒక వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. క్వీన్స్‌లాండ్‌లో ఈ వీడియో చిత్రీకరించారు. జేక్‌ స్టిన్సన్‌ అనే స్నేక్‌ క్యాచర్‌ ఫైతాన్ల ఫైట్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. ఈయన గత కొంతకాలంగా జేక్స్‌ రెప్టయిల్‌ రిలొకేషన్స్‌ అనే సంస్థను నిర్వహిస్తున్నారు. నివాసాల సమీపానికి వచ్చిన పాములను పట్టుకుని, వాటి సురక్షిత ప్రాంతాల్లో వదిలేసేందుకు ఒక స్వచ్ఛంధ సంస్థను నిర్వహిస్తున్నారు.

స్నేక్ క్యాచర్ జేక్‌ స్టిన్సన్‌ షేర్‌ చేసిన ఈ వీడియోలో.. దాదాపు పది అడుగుల పొడవు ఉన్న రెండు మగ కొండచిలువలు ఒకదానికొకటి భీకరంగా పోట్లాడుకున్నాయి. అదికూడా ఒక ఇంటి చూరు నుంచి కిందికి వేలాడుతూ! రెండు చిలువలూ ఒకదానిపై ఒకటి ఆధిపత్యం సాధించేలా పోట్లాడుకున్నట్టు కనిపించింది. కాసేపటికి ఒక కొండచిలువ ఇంటి పైకప్పు నుంచి కిందకు జారి పడిపోతుంది. అయినప్పటికీ.. పై నుంచి వేలాడుతున్న మరో కొండ చిలువను అందుకునేందుకు తెగ ప్రయత్నించింది. దాడి చేయాలన్న కసితో.. చూస్తూ ఉండిపోయింది.

కాసేపటికి చూరుపై వేలాడుతున్న కొండ చిలువు.. తిరిగి ఇంటి పైకప్పులోకి వెళ్లిపోతుంది. అవి అలా ఫైట్‌ చేస్తుండటం చూస్తే ముచ్చటేస్తున్నదని జేక్‌ స్టిన్సన్‌ పేర్కొన్నారు. ఇదొక అద్భుతమైన దృశ్యమన్నారు. పోరాడే క్రమంలో వీటి శబ్దాలు భయంకరంగా ఉన్నాయని చెప్పారు. దీర్ఘంగా బుసలు కొడుతుంటే.. లారీ ఇంజిన్‌ ఆపినప్పుడు బుస్‌.. అని వచ్చే శబ్దంలా ఉందని తెలిపారు.

ఇది పాముల బ్రీడింగ్‌ సీజన్‌. ఈ సమయంలో ఆడ పాములను వెతికే క్రమంలో మగ పాములు చాలా దూకుడుగా ప్రవర్తిస్తాయని జేక్‌ స్టిన్సన్‌ తెలిపారు. కార్పెట్‌ పైతాన్‌లు ఆకర్షణీయమైన రంగుల్లో ఉంటాయి. ఇవి విష రహితాలు. కనీసం మూడు మీటర్ల పొడవు వరకూ పెరుగుతాయి. ఆస్ట్రేలియా ఇళ్ల చూరుల్లో ఇవి నిత్యం కనిపిస్తుంటాయి. జనావాసాల్లోకి సహజంగా చొచ్చుకుపోతుంటాయి. వీటి బెడద నివారణకు క్వీన్స్‌లాండ్‌లో అధికారులు ఒక చట్టమే చేశారు.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. కొందరైతే ఇంటి చూర్లలో, ఫాల్‌సీలింగ్‌లో దాగిన పాముల వీడియోలను, గోల్ప్‌ క్లబ్‌లో దూసుకొస్తున్న కోబ్రా వీడియోలను షేర్ చేస్తున్నారు. ఒక్కో వీడియో.. ఒక్కో రేంజ్‌లో ఉంది.. మీరూ వాటిపై ఒక లుక్కేయండి..

కొండచిలువల బిగ్ ఫైట్‌ వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *