ఉత్తరప్రదేశ్లోని గోండాలో పృథ్వీనాథ ఆలయం చాలా కాలంగా భక్తులలో విశ్వాసం, భక్తి కేంద్రంగా ఉంది. ఈ ఆలయంలోని శివలింగాన్ని పాండవులు స్వయంగా ప్రతిష్టించారని ఒక నమ్మకం. ద్వాపరయుగం నాటి శివలింగాన్ని దర్శించుకునేందుకు అనేక ప్రాంతాల నుంచి భక్తులు వస్తారు.
ఆసియాలోనే ఎత్తైన శివలింగం
గోండా జిల్లాలోని ఖర్గుపూర్లోని పృథ్వీనాథ ఆలయం శివుడికి అంకితం చేయబడింది. ఈ ఆలయంలో ప్రతిష్టించబడిన శివలింగం ఆసియాలోనే ఎత్తైన శివలింగంగా పరిగణించబడుతుంది. ఇది 5.4 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ ఆలయం ఆధ్యాత్మిక దృక్కోణంలో చూస్తే ముఖ్యమైనది మాత్రమే కాదు. దీని చరిత్ర, పురాణ కథ నమ్మకం కూడా చాలా ప్రత్యేకమైనది. పృథ్వీనాథ ఆలయం భక్తులకు విశ్వాస కేంద్రంగా ఉంది. ఆలయ పూజారి జగదాంబ ప్రసాద్ తివారీ ఈ లయం గురించి అనేక విషయాలను వెల్లడించారు. అంతేకాదు భక్తులు కోరే ప్రతి కోరిక నెరవేరుతుందని చెప్పారు.
అతి ఎత్తైన శివలింగం
పృథ్వీనాథ ఆలయంలో ప్రతిష్టించబడిన శివలింగం ఆసియాలో.. కొన్ని నమ్మకాల ప్రకారం ప్రపంచంలోనే ఎత్తైన శివలింగంగా పరిగణించబడుతుంది. దీని 64 అడుగుల భాగం భూమికి దిగువన ఉంది. ఇది ఏడు విభాగాలుగా విభజించబడిందని భావిస్తారు. ఈ శివలింగం ప్రాముఖ్యత కారణంగా ఈ ఆలయం భక్తులకు ప్రత్యేక ఆకర్షణ కేంద్రంగా ఉంది. ఇక్కడ నిర్మలమైన హృదయంతో శివుడిని పూజించే భక్తులు ఆశించిన ఫలితాన్ని పొందుతారని నమ్ముతారు.
ఈ ప్రాంతంలో పాండవులు విశ్రాంతి తీసుకున్నరనే నమ్మకం
హిందూ మత విశ్వాసం ప్రకారం పృథ్వీనాథ ఆలయంలోని శివలింగాన్ని మహాబలి భీముడు స్థాపించాడు. ద్వాపర యుగంలో పాండవులు వనవాసం సమయంలో ఇక్కడ విశ్రాంతి తీసుకున్నారని, మహాబలి భీముడు ఈ శివలింగాన్ని ప్రతిష్టించాడని చెబుతారు. ప్రతి సంవత్సరం శివరాత్రి సందర్భంగా ఇక్కడ గొప్ప ఉత్సవం జరుగుతుంది.
మహాభారత కాలంలో నిర్మాణం
ఈ ఆలయంలోని శివలింగం 5000 సంవత్సరాల క్రితం మహాభారత కాలం నాటిదని.. ఇది నల్ల గీటురాయితో తయారు చేయబడిందని చెబుతారు. దేశ విదేశాల నుంచి భక్తులు పృథ్వీనాథ ఆలయాన్ని పూజించడానికి వస్తారు. హిందూ మత విశ్వాసం ప్రకారం ఈ శివాలయాన్ని సందర్శించడం, పూజించడం, జలాభిషేకం చేయడం వలన అన్ని దుఃఖాలు, బాధలు తొలగిపోతాయని నమ్మకం. ఈ శివలింగం ఎంత ఎత్తుగా ఉంటుందంటే భక్తులు నీటిని అర్పించడానికి తమ మడమలను ఎత్తాల్సి ఉంటుందని చెబుతారు. మహాశివరాత్రి, పవిత్ర శ్రావణ మాసంలో లక్షలాది మంది భక్తులు ఆలయానికి చేరుకొని పూజలు చేస్తారు.
మహాభారత కాలం, పాండవుల వనవాసం
పృథ్వీనాథ ఆలయ కథ మహాభారత కాలం నుంచి ప్రారంభమవుతుంది, పాండవులు వారి వనవాస సమయంలో ఒక సంవత్సరం పాటు అజ్ఞాతవాసం గడిపారు. మహాభారతంలోని 'వనపర్వం ప్రకారం, కౌరవులతో జూదంలో ఓడిపోయిన తర్వాత పాండవులు 12 సంవత్సరాల వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చింది. వనవాస సమయంలో తమ గుర్తింపు బయటపడితే.. మళ్ళీ 12 సంవత్సరాల వనవాసం , ఒక ఏడాది అజ్ఞాత వాసం చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో పాండవులు వారి తల్లి కుంతితో కలిసి కౌశల రాష్ట్రంలోని పంచారణ్య ప్రాంతానికి చేరుకున్నారు. దీనిని నేడు గోండా చుట్టుపక్కల ప్రాంతం అని పిలుస్తారు. అప్పట్లో చక్రనగరి లేదా ఏకచక్ర నగరి అని పిలువబడే ఈ ప్రాంతంలో భయంకరమైన రాక్షసుడు బకాసురుడి నివసించేవాడు. అతని భయం స్థానికులకు ఉండేది. బకాసురుడు ప్రతిరోజూ నగరవాసుల నుంచి ఎద్దుల బండి, వంటకాలు, ఒక వ్యక్తిని డిమాండ్ చేసేవాడు. అతను వాటిని తినేవాడు.
ఒకరోజు ఒక బ్రాహ్మణ ఫ్యామిలీ వంతు వచ్చింది. ఆ సమయంలో పాండవులు అదే బ్రాహ్మణ కుటుంబం ఇంట్లో ఉంటున్నారు. వారి బాధను చూసి కుంతి తన కుమారుడు భీముడిని బకాసురుడికి ఆహారం బండిని తీసుకెళ్ళమని పంపింది. భీముడు బకాసురుడిని సంహరించి ఆ ప్రాంత ప్రజలను అతని బారి నుంచి రక్షించాడు. అయితే బకాసురుడు ఒక బ్రాహ్మణ రాక్షసుడు. దీంతో భీముడుకి బ్రహ్మ హత్యాపాతకం చుట్టుకుంది. . ఈ పాపం నుంచి బయటపడేందుకు భీముడు శ్రీకృష్ణుని మార్గదర్శకత్వంలో శివుని కోసం తపస్సు చేశాడు. ఖర్గుపూర్ ప్రాంతంలో ఒక పెద్ద శివలింగాన్ని ప్రతిష్టించాడు. ఈ శివలింగం నల్లరాయితో తయారు చేయబడింది. ఇది దాదాపు ఐదున్నర అడుగుల ఎత్తు ఉంటుంది. అంతేకాదు శివలింగం 64 అడుగులు భూమి కిందకి ఉందని చెబుతారు. పురావస్తు శాఖ పరిశోధన ప్రకారం ఈ శివలింగం దాదాపు 5000 నుంచి 6500 సంవత్సరాల పురాతనమైనది. ఇది మహాభారత కాలంతో ముడిపడి ఉంది.
శివలింగ పునరుద్ధరణ, ఆలయ నామకరణం
కాలక్రమేణా ఈ శివలింగం నెమ్మదిగా భూమిలోకి కూరుకుపోయింది. తరువాత 19వ శతాబ్దంలో గోండా రాజు సైన్యంలో రిటైర్డ్ సైనికుడైన పృథ్వీ సింగ్ ఖర్గుపూర్లో తన ఇల్లుని నిర్మించుకోవడానికి ఒక దిబ్బను తవ్వడం ప్రారంభించాడు. తవ్వుతున్నప్పుడు ఒక ప్రదేశం నుంచి రక్తపు ఊట రావడం ప్రారంభమైంది. దీని కారణంగా కార్మికులు భయపడి పని ఆగిపేశారు. ఆ రాత్రి శివుడు పృథ్వీ సింగ్ కలలో కనిపించి.. ఏడు భాగాలుగా శివలింగం భూమి కింద ఉందని చెప్పాడు.
తనకు వచ్చిన కల ప్రకారం పృథ్వీ సింగ్ మర్నాడు అక్కడ తవ్వకాలు చేశాడు. అక్కడ ఒక పెద్ద శివలింగం బయల్పడింది. దీని తరువాత అతను శివలింగాన్ని ఆచారాలతో పూజించడం ప్రారంభించాడు. ఆలయాన్ని నిర్మించాడు. అప్పటి నుంచి ఈ ఆలయం “పృథ్వీనాథ ఆలయం” గా పిలువబడుతుంది. మొఘల్ కాలంలో ఒక జనరల్ కూడా ఈ ఆలయంలో పూజలు చేసి దానిని పునరుద్ధరించాడని చెబుతారు. దీని తరువాత, ఈ ఆలయం మరింత ప్రసిద్ధి చెందింది.