కేజియఫ్ అనే ఒక్క సినిమాతో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయిపోయారు ప్రశాంత్ నీల్. ఈయనతో పని చేయడానికి తెలుగు హీరోలు క్యూ కట్టారు. ఆల్రెడీ ప్రభాస్‌తో సలార్ చేసారు.. 600 కోట్లు కొట్టేసారు. ప్రస్తుతం తారక్‌తో డ్రాగన్ తెరకెక్కిస్తున్నారు.
ఇది సెట్స్‌పై ఉండగానే నెక్ట్స్ ప్రాజెక్ట్స్ అప్పుడే సెట్ చేసుకుంటున్నారు నీల్. ఈయన లిస్టు భారీగానే ఉంది.డ్రాగన్ తర్వాత ప్రశాంత్ లిస్టులో స్టార్స్ ఉన్నారు. ఇప్పటికే కేజియఫ్ 3 అనౌన్స్ చేసినా.. అదిప్పట్లో మొదలయ్యే అవకాశాలైతే లేవు.
అలాగే సలార్ 2 కూడా క్యూలో ఉంది. కానీ అటు ప్రభాస్.. ఇటు నీల్ వేర్వేరు సినిమాలతో బిజీగా ఉండటంతో.. సలార్ 2 ఇప్పట్లో పట్టాలెక్కడం కష్టమే. ఈ గ్యాప్‌లో అల్లు అర్జున్ వచ్చేసారు.. అన్నీ కుదిర్తే అట్లీ తర్వాత బన్నీ చేయబోయే సినిమా నీల్తోనే..!
2026, జూన్ 25న డ్రాగన్ విడుదల కానుంది. ఆలోపు అట్లీ, బన్నీ సినిమా షూట్ పూర్తి కానుంది. ఆ తర్వాత అల్లు అర్జున్, ప్రశాంత్ నీల్ కాంబో సెట్స్‌పైకి రానుంది. దిల్ రాజు నిర్మించబోయే ఈ సినిమాకు రావణం అనే టైటిల్ కన్ఫర్మ్ చేసారు.
మైథాలజీ బ్యాక్‌డ్రాప్‌లో రావణం రానుందని తెలుస్తుంది. రామ్ చరణ్, మహేష్ బాబుతోనూ ప్రశాంత్ నీల్ సినిమాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది.