ప్రసాద్ బాబు.. ఈతరం ప్రేక్షకులకు అంతగా తెలియకపోవచ్చు. కానీ 90వ దశకం సినీప్రియులకు సుపరిచితమే. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి జనాలకు దగ్గరయ్యారు. నటుడిగానే కాకుండా విలన్ పాత్రలలోనూ కనిపించారు. సినిమాలతోపాటు బుల్లితెరపై అనేక సీరియల్స్ చేశారు. స్టార్ హీరోహీరోయిన్లకు తండ్రిగా, మామగా కనిపించారు.75 ఏళ్ల వయసులో కూడా ఈ నటుడు పూర్తిగా సినిమాల్లో చురుగ్గా నటిస్తున్నారు. సినిమాలతో పాటు, అనేక సీరియల్స్‌లో కూడా కనిపించారు. ఇది మాత్రమే కాదు ప్రసాద్ బాబు విలన్ పాత్రలో నటించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రం ‘అంతుల్ని కథ’తో పరిశ్రమలోకి అడుగుపెట్టారు ప్రసాద్ బాబు. ఈ చిత్రంలో తిలక్ పాత్రను పోషించాడు. బాపు దర్శకత్వం వహించిన ‘మన ఊరి పాండవులు’ చిత్రంలో నటించారు. ఈ రెండు సినిమాలతో పాపులర్ అయ్యారు.
ఈ సినిమాల తర్వాత తన కెరీర్‌లో ఎప్పుడూ వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. చిరంజీవి నుండి నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ నుండి మహేష్ బాబు, ప్రభాస్ వరకు దాదాపు అందరు హీరోలతో ఆయన పనిచేశారు. సినిమాల్లోనే కాదు, అనేక సీరియల్స్‌లో కూడా తనదైన ముద్ర వేశారు. జెమిని టీవీలో ‘నిన్నే పెళ్లాడతా’ సీరియల్‌తో బుల్లితెరపై సూపర్ క్రేజ్ సంపాదించారు. ఈటీవీలో ‘జయం’, జీ టీవీలో ‘చిన్న కోడలు’, మా టీవీలో ‘రాములమ్మ’ వంటి అనేక సీరియల్స్‌లో కీలకపాత్రలు పోషించారు. కానీ మీకు తెలుసా.. ప్రసాద్ బాబు కొడుకు, కోడలు సైతం ఇండస్ట్రీలో తోపు యాక్టర్స్.
ప్రసాద్ బాబు కోడలు కూడా టాప్ తెలుగు హీరోయిన్ అని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఆయన కొడుకు పేరు శ్రీకర్. ప్రస్తుతం సీరియల్స్ చేస్తున్నారు. ఇక కోడలు సంతోషిని. నవదీప్ హీరోగా నటించిన ‘జై’ చిత్రంతో తెలుగు సినిమాలోకి అడుగుపెట్టింది. ఈ చిత్రంలో అందం, అభినయంతో కట్టిపడేసింది. ఆ తర్వాత కథానాయికగా కాకుండా సహయ పాత్రలు పోషించింది. సిద్దార్థ్, త్రిష నటించిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంలో పనిమనిషి పాత్రలో కనిపించింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె.. ప్రస్తుతం బ్యూటిషన్ రంగంలో దూసుకుపోతుంది.
ఇవి కూడా చదవండి :
Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. సినిమాలు వదిలేసి మైక్రో మ్యాక్స్ సీఈవోతో ప్రేమ.. ఇప్పుడేం చేస్తుందంటే..
Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..
Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..
Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..