Prabhas: హీరో ప్రభాస్‌తో నటించాలని ఉందా? ఈ సూపర్ ఛాన్స్ మీకోసమే.. ఇలా చేసేయండి

Prabhas: హీరో ప్రభాస్‌తో నటించాలని ఉందా? ఈ సూపర్ ఛాన్స్ మీకోసమే.. ఇలా చేసేయండి


పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా కాంబోలో ఒక క్రేజీ ప్రాజెక్టు తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. స్పిరిట్‌ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో యానిమల్ బ్యూటీ తృప్తి దిమ్రి హీరోయిన్ గా నటిస్తోంది. సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ స్పిరిట్ సినిమాను నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటోంది. సెప్టెంబర్ లో రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో కొత్తవారికి కూడా అవకాశం కల్పిస్తున్నారు. తాజాగా దానికి సంబంధించిన సమాచారాన్ని చిత్ర బృందం పంచుకుంది. స్పిరిట్ సినిమాలో న‌టించేందుకు ఆస‌క్తి ఉన్న వారిని డిజిట‌ల్ ఆడిష‌న్స్‌కి ఆహ్వానించింది. ఈ మేరకు భ‌ద్ర‌కాళీ పిక్చ‌ర్స్ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది .

ప్రభాస్ స్పిరిట్ సినిమాలో నటించేందుకు 13 నుంచి 17 ఏళ్ల వ‌య‌సున్న అబ్బాయిలు ఈ ఆడిషన్స్ లో పాల్గొనవచ్చని చిత్ర బృందం తెలిపింది. అయితే ఆడిష‌న్స్‌లో పాల్గోనేవారు పాత్ర కోసం త‌మ జుట్టు కత్తిరించుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాల‌ని తెలిపింది. అలాగే ఒక హెడ్ షాట్ ఫోటోతో పాటు పర్సనల్ షాట్ ఫొటోలు కూడా పంపించాలని కోరారు. ఇక ఇంట్రడక్షన్ వీడియోలో మీ పేరు ఇతర వివరాలు వెల్లడించడంతోపాటు మీ చదువుకు సంబంధించిన వివరాలు కూడా వెల్లడించాలని సూచించారు. ఈ మేరకు వివరాలను spirit.bhadrakalipictures@gmail.com కి పంపాలని కోరారు.

ఇవి కూడా చదవండి

చాలా మంది ప్రభాస్ తో సెల్ఫీ దిగితే చాలనుకుంటారు. అయితే ఇప్పుడు ఏకంగా  అతనితోనే నటించే అవకాశం వచ్చింది. మరెందుకు లేటు వెంటనే ఈ అవకాశాలన్ని సద్వినియోగం చేసుకోండి.

స్పిరిట్ క్యాస్టింగ్ కాల్ వివరాలివే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *