ఇప్పటికీ మోకాలు నొప్పితో బాధపడుతున్న ప్రభాస్.. తన నొప్పిని పక్కన పెట్టి మరీ తాను కమిట్ అయిన సినిమాల షూటింగ్స్‌ను పరిగెత్తిస్తున్నాడు. ఈ క్రమంలోనే మరో ప్రమాదానికి గురయ్యాడట ప్రభాస్. ఫౌజీ సినిమా షూటింగ్‌లో భాగంగా గుర్రపు స్వారీ చూస్తూ.. కిందపడ్డారట. దీంతో ఆయన చేతికి గాయమైందని తెలుస్తోంది. ఇక ఈ విషయంపై అఫీషియల్‌గా ప్రభాస్ టీం రియాక్ట్ కానప్పటికీ.. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాయం నుంచి ప్రభాస్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం.. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవలే రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఇక ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు హనురాఘవపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఫౌజీ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఫౌజీ సినిమాలో.. ప్రభాస్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడని తెలుస్తుంది. అంతేకాదు ఫౌజీ సినిమా వరల్డ్ వార్ నేపథ్యంగా సాగనుందట. ఇందుకోసం ప్రభాస్ తీవ్రంగా శ్రమించవలిసి వస్తోందని .. ఇన్‌సైడ్ టాక్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Chiranjeevi: చిరుకు సర్జరీ ?? ఆందోళనలో ఫ్యాన్స్
Kova Bun Ali: కోవా బన్ వలికి.. మెగా సపోర్ట్
జూ పార్క్‌లో హిప్పోల బర్త్ డే సెలబ్రేషన్స్
పైకి మాత్రం కుటీర పరిశ్రమ.. లోపలే ఉంది అసలు రహస్యం
ఇసుకతో ప్రాణం పోశారు !! ఈ శిల్పాన్ని చూస్తే కళ్ళు తిప్పుకోలేరు !!