ప్రస్తుతం చిన్న సినిమాలు థియేటర్లలలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక వాలెంటైన్స్ వీక్ సందర్భంగా ఈ వారం మొత్తం చిన్న చిత్రాల హవా నడుస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు అలాంటి ఓ చిన్న సినిమా గురించి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆసక్తికర పోస్ట్ చేశారు. తనకు వర్షం సినిమా ఎలాగో.. అలాగే యంగ్ హీరోకు ఈ సినిమా అలాగే అంటూ రాసుకొచ్చారు. అసలు విషయానికి వస్తే.. యంగ్ హీరో సంతోష్ శోభన్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ కపుల్ ఫ్రెండ్లీ. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ఈ హీరో నటించిన ఈ సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. జీవితంలో ఎలాంటి ఆశలు లేని ఓ కుర్రాడి జీవితంలోకి ఓ అమ్మాయి రావడం.. ఆ అమ్మాయితో ఒకే ఇంట్లో గడపాల్సి రావడం.. తర్వాత ఇద్దరి జీవితాల్లోకి ఎలాంటి పరిస్థితులు వచ్చాయి అనేది సినిమా.
ఎక్కువమంది చదివినవి : Jabardasth: జబర్దస్త్ మానేసి తప్పు చేశాను.. మాటలు నమ్మి అలా జరిగింది.. జబర్దస్త్ కమెడియన్..
తాజాగా ఈ మూవీపై ప్రశంసలు కురిపించారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. “ఇదొక లవ్లీ, బ్యూటీఫుల్ ఫిలిం. కపుల్ ఫ్రెండ్లీ సినిమాను చాలా ఎంజాయ్ చేశాను. సంతోష్, మానస వారణాసి జోడి వండర్ ఫుల్ గా ఉంది. అశ్విన్ ఎంతో ప్రతిభావంతంగా సినిమాను తెరకెక్కించాడు. ఇలాంటి కథలను వెండితెరపైకి తీసుకువచ్చినందుకు అజయ్, యువీ క్రియేషన్స్ టీమ్ మొత్తానికి అభినందనలు. నాకు వర్షం సినిమా ఎలాగో.. మై డియర్ సంతోష్ శోభన్ కు కపుల్ ఫ్రెండ్లీ అలా అవుతుంది” అంటూ రాసుకొచ్చారు ప్రభాస్. ఇప్పుడు డార్లింగ్ చేసిన ఈ పోస్ట్ ఈ చిత్రానికి బూస్టప్ లా పనిచేస్తుంది.
ఎక్కువమంది చదివినవి : Actor : సూపర్ స్టార్ కొడుకు.. అయినా అవకాశాలు ఇవ్వలేదు.. ఒక్క సినిమాతో ఇండస్ట్రీనే షేక్ చేశాడు..
సంతోష్ శోభన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ తెలుగు, తమిళ భాషలలో నిర్మించిన ఈ చిత్రానికి ఆదిత్య రవీంద్రన్ సంగీతం అందించారు. ఇందులో మానస వారణాసి కథానాయికగా నటించింది. ఈ చిత్రాన్ని ధీరజ్ మొగిలినేని రిలీజ్ చేశారు.
ఎక్కువమంది చదివినవి : Uday Kiran : అప్పుడు నాకు ఏడేళ్లు.. మా మావయ్య సినిమాను థియేటర్లలో చూడండి.. ఉదయ్ కిరణ్ మేనల్లుడు రిక్వెస్ట్..
ఎక్కువమంది చదివినవి : Folk Song : ఏం పాటరా బాబూ.. కుర్రాళ్లు తెగ పాడుతున్న ఫోక్ సాంగ్.. దెబ్బకు యూట్యూబ్లో సంచలనంగా మారింది..