Post Office: పోస్టాఫీస్ బంపర్ ఆఫర్.. రూ.370 పొదుపుతో చేతికి రూ.8 లక్షలు..

Post Office: పోస్టాఫీస్ బంపర్ ఆఫర్.. రూ.370 పొదుపుతో చేతికి రూ.8 లక్షలు..


Post Office: పోస్టాఫీస్ బంపర్ ఆఫర్.. రూ.370 పొదుపుతో చేతికి రూ.8 లక్షలు..

నేటి కాలంలో స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి పెట్టుబడి మార్గాల్లో రిస్క్ ఎక్కువగా ఉంటుందని భావించే వారికి.. పోస్ట్ ఆఫీస్ అందించే పథకాలు ఒక నమ్మకమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు, వేతన జీవులు తమ భవిష్యత్తు అవసరాల కోసం ఎటువంటి రిస్క్ లేకుండా క్రమపద్ధతిలో డబ్బును దాచుకోవడానికి పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ ఒక అద్భుతమైన వేదిక. ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని సేవ్ చేయడం వల్ల మెచ్యూరిటీ తర్వాత భారీ మొత్తం చేతికి వస్తుంది. ప్రస్తుతం ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా లాభదాయకమైన రాబడిని ఎలా పొందవచ్చో ఒకసారి పరిశీలిద్దాం.

5 ఏళ్ల ప్లాన్.. స్థిరమైన ఆదాయం

పోస్ట్ ఆఫీస్ RD కాలపరిమితి 5 సంవత్సరాలు . ఫిబ్రవరి 2026 నాటికి ప్రభుత్వం ఈ పథకంపై 6.7శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఈ వడ్డీ ప్రతి మూడు నెలలకు ఒకసారి అకౌంట్‌లో పడుతుంది. దీనివల్ల పెట్టుబడిదారులకు చక్రవడ్డీ లాభం చేకూరుతుంది.

రూ.11,111 డిపాజిట్ చేస్తే ఎంత వస్తుంది?

ఒకవేళ మీరు ప్రతి నెలా రూ.11,111 చొప్పున ఈ పథకంలో పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ సమయానికి ఎంత చేతికి వస్తుందంటే..?

  • నెలవారీ డిపాజిట్: రూ.11,111
  • మొత్తం పెట్టుబడి కాలం: 5 ఏళ్లు (60 నెలలు)
  • మీరు జమ చేసే మొత్తం: రూ.6,66,660
  • వడ్డీ రేటు: 6.7శాతం
  • మొత్తం వడ్డీ ఆదాయం: రూ.1,26,285.72
  • మెచ్యూరిటీ మొత్తం : 7,92,945.72

అంటే 5 ఏళ్ల తర్వాత మీ చేతికి దాదాపు రూ.7.93 లక్షలు అందుతాయి. మీ పిల్లల ఉన్నత చదువులకు లేదా భవిష్యత్తు అవసరాలకు ఇది ఒక మంచి నిధిగా మారుతుంది.

ఈ పథకం ప్రత్యేకతలు ఏంటి..?

కేవలం రూ.100తో ఈ ఖాతాను ప్రారంభించవచ్చు. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. 12 వాయిదాలు సక్రమంగా చెల్లించిన తర్వాత, ఖాతాలో ఉన్న మొత్తంలో 50% వరకు రుణం పొందే అవకాశం ఉంది.
ఖాతా తెరిచిన 3 ఏళ్ల తర్వాత అవసరమైతే ఖాతాను క్లోజ్ చేయొచ్చు. ఇది ప్రభుత్వ పథకం కాబట్టి మీ పెట్టుబడికి పూర్తి భద్రత ఉంటుంది.

ఎవరికి ఇది సరైన ఎంపిక?

స్థిరమైన జీతం వచ్చే ఉద్యోగులు, చిన్న చిన్న మొత్తాల్లో పొదుపు చేయాలనుకునే గృహిణులు, రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని సీనియర్ సిటిజన్లకు ఈ RD పథకం బెస్ట్ ఆప్షన్. మీరు కూడా ఈ పథకంలో చేరాలనుకుంటే మీకు సమీపంలోని పోస్టాఫీసును సందర్శించి ఆధార్, పాన్ కార్డు, ఫోటోలతో సులభంగా ఖాతాను ప్రారంభించవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *