అసలే ఇప్పుడు వర్షాకాలం. వర్షాలు మొత్తుతాయ్ అని అందరూ అనుకుంటుంటే.. అవి కాస్తా ముఖం చాటేశాయి. చల్లచల్లగా ఉండాల్సిన వాతావరణంలో కూడా ఉక్కపోత, వేడి పెరిగిపోతోంది. ఈ అన్-సీజనల్ ఉక్కపోతకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలోనే ఏసీ, కూలర్‌ల వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే ఈ ఏసీ, కూలర్‌లు.. ఒక గంట వేస్తే చాలు.. కరెంట్ బిల్లుతో చుక్కలు చూడాల్సిందే. మరి అలాంటప్పుడు.. మీ చేతిలోనే రిమోట్ ఉండేలా.. తక్కువ కరెంట్ ఖర్చుతో మీరుంటున్న రూమ్‌ను ఈజీగా చల్లబరుచుకోవచ్చు. అదే పోర్టబుల్ ఏసీ. ఈ-కామర్స్ సైట్లలో ఈ పోర్టబుల్ ఏసీలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. వీటిని మీరు ఇంట్లో ఎక్కడైనా పెట్టొచ్చు, ఎక్కడికైనా తీసుకుని వెళ్లొచ్చు. బరువు కూడా చాలా తక్కువ. మరి లేట్ ఎందుకు ఓ పోర్టబుల్ ఏసీ గురించి.? దాని ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందామా..
ఈ పోర్టబుల్ ఏసీ ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 2,889 కాగా.. 48 శాతం తగ్గింపుతో రూ. 1489కి లభిస్తోంది. దీనిలో 2400mAh చార్జబుల్ బ్యాటరీ ఉండగా.. సీ-కేబుల్, పవర్ బ్యాంక్, కార్ చార్జర్, యూఎస్బీ డివైజ్.. ఇలా వేటితోనైనా దాన్ని చార్జ్ చేసుకోవచ్చు. ఈ పోర్టబుల్ ఏసీని ఎక్కడికైనా తీసుకెళ్లేందుకు హ్యాండిల్ సౌకర్యం కూడా ఉంది. దీని వాటర్ ట్యాంక్‌లో ఐస్ క్యూబ్స్ లేదా వాటర్ పోయవచ్చు. అలాగే దీని స్పీడ్‌ను మీకు కావాల్సినట్టుగా తగ్గించుకోవచ్చు. ఈ పోర్టబుల్ ఏసీ ఫ్యాన్ నుంచి సుమారు 55dB సౌండ్ వస్తుండగా.. అది మీ నిద్రను ఏమాత్రం డిస్టర్బ్ చేయదు. అలాగే మీరు ఈ పోర్టబుల్ ఏసీని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. సుమారు 3 గంటల వరకు పని చేస్తుంది. రాత్రివేళ 7 రంగుల్లో దీని ఎల్ఈడీ మీ బెడ్ రూమ్‌కు కాంతి అందిస్తుంద. ఈ పోర్టబుల్ ఏసీని ఆఫీస్ టేబుల్, అవుట్ డోర్, బెడ్ రూమ్, లివింగ్ రూమ్, బయట పిక్నిక్‌లకు వెళ్ళినప్పుడు వాడుకోవచ్చు.(Source)
ఇది చదవండి: బాబోయ్.. ఇది బాహుబలి కారు అండీ.! 754 కిమీ రేంజ్.. ధర తెలిస్తే బిత్తరపోతారు
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..