PNB Bank Jobs 2026: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో 5,138 ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని పోస్టులున్నాయంటే?

PNB Bank Jobs 2026: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో 5,138 ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని పోస్టులున్నాయంటే?


పంజాబ్ నేషనల్‌ బ్యాంక్‌ (PNB).. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని బ్రాంచుల్లో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 5,138 ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో ఫిబ్రవరి 8, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

రాష్ట్రాల వారీగా ఖాళీల వివరాలు ఇలా..

  • తెలంగాణ రాష్ట్రంలో ఖాళీలు: 69
  • ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఖాళీలు: 56
  • తమిళనాడు రాష్ట్రంలో ఖాళీలు: 121
  • కర్ణాటక రాష్ట్రంలో ఖాళీలు: 64
  • కేరళ రాష్ట్రంలో ఖాళీలు: 83
  • ఒడిశా రాష్ట్రంలో ఖాళీలు: 142
  • పాండిచ్చెరిలో ఖాళీలు: 2

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి 20 నుంచి 28 ఏళ్ల వరకు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్ధులకు మూడేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో ఫిబ్రవరి 24, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.800 వరకు పీడబ్ల్యూబీడీ, ఎస్సీ, ఎస్టీ, ట్రాన్స్‌ జెండర్ అభ్యర్థులు రూ.200 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ రాత పరీక్ష, లోకల్ లాంగ్వేజ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌, మెడికల్ ఎగ్జామినేషన్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ. 12,300 నుంచి రూ.15,000 వరకు స్టైపెండ్ చెల్లిస్తారు. ఇతర వివరాలు ఈ కింది నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పంజాబ్ నేషనల్‌ బ్యాంక్‌ ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *