PM Modi Baagh Watch: AI సమ్మిట్‌లో ప్రధాని మోదీ ధరించిన వాచ్ ప్రత్యేకతలు తెలుసా?

PM Modi Baagh Watch: AI సమ్మిట్‌లో ప్రధాని మోదీ ధరించిన వాచ్ ప్రత్యేకతలు తెలుసా?


ఆ సమయంలో సాంకేతికత కంటే ఎక్కువగా ఆయన మణికట్టుపై ఉన్న ఒక చేతి గడియారం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. భవిష్యత్తు గురించి మాట్లాడుతున్న తరుణంలో, చరిత్రను ప్రతిబింబించే ఆ వాచ్‌ను ధరించడం వెనుక ఒక బలమైన సందేశం దాగి ఉంది.

ప్రపంచ టెక్ దిగ్గజాలు, సీఈవోలు అంతా కలిసి రేపటి సాంకేతికత గురించి చర్చిస్తున్న వేళ, ఆయన మాత్రం మన మూలాలను గుర్తు చేసే ఒక వస్తువుతో వేదికపైకి వచ్చారు. మెషీన్ లెర్నింగ్, డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ వంటి అంశాల మధ్య ఆ అనలాగ్ వాచ్ ఒక అద్భుతమైన స్టైల్ స్టేట్‌మెంట్‌గా నిలిచింది. జైపూర్ వాచ్ కంపెనీకి చెందిన గౌరవ్ మెహతా అత్యంత ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేసిన ఆ వాచ్ పేరు ‘బాఘ్’. భారతదేశ స్వాతంత్ర్య చరిత్రను తనలో నింపుకున్న ఆ గడియారం విశేషాలు తెలుసుకుందాం..

1947 నాటి నాణెంతో అపురూప డిజైన్..

ఈ ‘బాఘ్’ వాచ్ కేవలం సమయాన్ని చూపే పరికరం మాత్రమే కాదు, ఇది మన దేశ వారసత్వానికి చిహ్నం. ఈ వాచ్ డయల్ మధ్యలో 1947 నాటి అసలైన భారతీయ నాణేన్ని అమర్చారు. దేశం స్వాతంత్ర్యం పొందిన సంవత్సరాన్ని ప్రతిబింబించే ఆ నాణెం, వాచ్‌ను ఒక చారిత్రక కళాఖండంగా మార్చింది. అత్యాధునిక సాంకేతికతతో కూడిన సదస్సులో ఇలాంటి చరిత్ర కలిగిన వస్తువును ధరించడం ద్వారా.. “ప్రగతి ఎంత సాధించినా, మన మూలాలను మర్చిపోకూడదు” అనే సందేశాన్ని ప్రధాని ఇచ్చారు.

హిందీలో ‘బాఘ్’ అంటే పులి. ఈ వాచ్ డయల్‌పై పులి ఆకృతిని పొందుపరిచారు. ఇది దేశం యొక్క బలానికి, సార్వభౌమత్వానికి మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్ శక్తికి నిదర్శనం. గ్లోబల్ పోటీతత్వం గురించి మాట్లాడుతున్న సమయంలో, పులి ఆకృతి ఉన్న వాచ్‌ను ధరించడం దేశాభివృద్ధిని సూచిస్తుంది. కేవలం ఖరీదైన వస్తువులను ధరించడం కంటే, ఉద్దేశపూర్వకమైన మరియు అర్థవంతమైన వస్తువులను ఎంచుకోవడమే నిజమైన లగ్జరీ అని ప్రధాని నిరూపించారు.

సాధారణంగా లగ్జరీ వాచీలు అంటే లక్షలు, కోట్లలో ఉంటాయని అందరూ అనుకుంటారు. కానీ ప్రధాని మోదీ ధరించిన ఈ బాఘ్ వాచ్ ధర సుమారు రూ. 55,000 మాత్రమే. అత్యంత ఖరీదైన బ్రాండ్ల కంటే మన దేశీయ కళాకారుల నైపుణ్యానికి ఆయన పెద్దపీట వేశారు. ఇది భారతీయ ఫ్యాషన్ ప్రపంచానికి ఒక గొప్ప గుర్తింపును తెచ్చిపెట్టింది. యూరోపియన్ బ్రాండ్ల కంటే మన దేశీయ బ్రాండ్లు ఏమాత్రం తక్కువ కాదని ఈ సంఘటన నిరూపించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన భవిష్యత్తును నిర్ణయించవచ్చు కానీ, మన అస్తిత్వం మన చరిత్ర ద్వారానే వస్తుందని ఈ ‘బాఘ్’ వాచ్ గుర్తు చేస్తోంది. టెక్నాలజీ సదస్సులో ప్రధాని మోదీ వేసిన ఈ స్టైల్ స్టేట్‌మెంట్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *