Piyush Goyal: ఇండియా-అమెరికా ట్రేడ్ డీల్‌పై రాహుల్ వ్యాఖ్యలు ఫేక్‌.. పియూష్‌ గోయల్‌ ఫైర్‌

Piyush Goyal: ఇండియా-అమెరికా ట్రేడ్ డీల్‌పై రాహుల్ వ్యాఖ్యలు ఫేక్‌.. పియూష్‌ గోయల్‌ ఫైర్‌


ఇండియా-అమెరికా మధ్య కుదిరిన ట్రేడ్ డీల్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ తీవ్రంగా స్పందించారు. రాహుల్ వ్యాఖ్యలు ‘స్టేజ్ మేనేజ్‌డ్‌, ఆర్టిఫిషియల్‌, బేస్‌లెస్’ అంటూ మండిపడ్డారు. రైతులను తప్పుదోవ పట్టించడానికే రాహుల్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. “రాహుల్ గాంధీ మరోసారి ఫేక్‌ నేరేటివ్‌ను తెరపైకి తెచ్చారు. ఈసారి కాంగ్రెస్ కార్యకర్తలను రైతు నాయకుల్లా చూపించి.. పూర్తిగా ఆర్టిఫిషియల్, బేస్‌లెస్ సంభాషణను సృష్టించారు” అంటూ ఆయన ఎక్స్ వేదికగా వీడియో పోస్ట్ చేశారు. ఇండియా-అమెరికా ట్రేడ్ డీల్‌లో రైతుల ప్రయోజనాలు పూర్తిగా సేఫ్ అని స్పష్టం చేశారు. ట్రేడ్ ఒప్పందం రైతులకు మాత్రమే కాకుండా.. మత్స్యకారులకు, యువతకు, MSMEలకు, స్టార్టప్‌లకు కూడా ప్రయోజనం చేకూరుస్తుందని గోయల్ తెలిపారు. రాహుల్ గాంధీ.. ఫేక్, బేస్‌లెస్ ఆరోపణలు, కల్పిత కథనాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.

ఈ ఒప్పందంలో సోయామీల్‌, మొక్కజొన్న వంటి సున్నితమైన పంటలకు ఏ రాయితీలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రజల్లో భయం పెంచేందుకే ప్రతిపక్షాలు నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. యాపిల్, వాల్‌నట్ దిగుమతులపై కూడా గోయల్ వివరంగా చెప్పారు. భారత్‌లో ఇప్పటికే డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ఏటా సుమారు 5.5 లక్షల టన్నుల యాపిల్స్ దిగుమతి అవుతున్నాయని తెలిపారు. అయితే అమెరికా నుంచి యాపిల్స్‌కు అన్‌లిమిటెడ్‌గా అనుమతి ఇవ్వలేదని, క్వోటా పెట్టామని చెప్పారు. అంతేకాదు, యాపిల్స్‌కు కనీస దిగుమతి ధర (MIP) రూ.80/కిలోగా నిర్ణయించామని తెలిపారు. పైగా అదనంగా రూ.25 డ్యూటీ ఉండడంతో అమెరికా యాపిల్ ధర దాదాపు రూ.105/కిలోకి వస్తుందని చెప్పారు. దీంతో భారత రైతులకు పోటీ వల్ల నష్టం ఉండదని పేర్కొన్నారు.

వాల్‌నట్ విషయంలో కూడా అమెరికాకు 13,000 మెట్రిక్ టన్నుల క్వోటా మాత్రమే ఇచ్చామని, కానీ భారత్‌లో మొత్తం అవసరం 60,000 మెట్రిక్ టన్నులు ఉండడంతో స్థానిక ఉత్పత్తిదారులకు నష్టం వచ్చే అవకాశమే లేదన్నారు. యూపీఏ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 20 బిలియన్ డాలర్ల వ్యవసాయ ఉత్పత్తులు దిగుమతి చేసిందని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు మోదీ ప్రభుత్వం డెయిరీని పూర్తిగా ఒప్పందం నుంచి తప్పించిందని తెలిపారు. చివరగా కిసాన్ సురక్షిత్ దేశ్ వికసిత్ అంటూ.. ఈ డీల్ ద్వారా బాస్మతి బియ్యం, మసాలాలు వంటి భారత ఎగుమతులకు కొత్త మార్కెట్లు తెరుచుకుంటాయని, అదే సమయంలో రైతుల భద్రతకు భంగం కలగకుండా ఒప్పందాన్ని రూపొందించామని గోయల్ చెప్పారు.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *