PhonePe: ‘ఫోన్ పే’ వాడుతున్నారా ?? జాగ్రత్త.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

PhonePe: ‘ఫోన్ పే’ వాడుతున్నారా ?? జాగ్రత్త.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి


ప్రస్తుకాలంలో అన్నీ డిజిటల్‌ చెల్లింపులే. నగదు లావాదేవీలు దాదాపు తగ్గిపోయాయి. దీనిని ఆసరాగా చేసుకొని కొందరు కేటుగాళ్లు చిరు, సామాన్య వ్యాపారులను మోసంచేసి అడ్డంగా దోచేస్తున్నారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఒక మినీ సూపర్ మార్కెట్ వద్దకు కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు, హోటల్ పెడుతున్నామంటూ నమ్మబలికి రూ. 25 వేల విలువైన వంటనూనెను కొనుగోలు చేశారు. నగదు లేదని, ‘ఫోన్ పే’ చేస్తామని చెప్పి, నకిలీ సక్సెస్ రిసిప్ట్‌ను చూపించి సామాగ్రితో ఉడాయించారు. తీరా మరుసటి రోజు ఖాతా చెక్ చేసుకుంటే కానీ తాము మోసపోయామని బాధితులు గుర్తించలేదు. ఇదేవిధంగా… పెద్దారవీడు మండలంలో మరో కిరాణా షాపులో రూ.21 వేలు దోచుకున్నారు. మరోవైపు త్రిపురాంతకంలో ఇదే విధంగా ఓ వ్యాపారిని మోసగాళ్ళు మోసం చేశారు. కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఫోన్‌ ద్వారా నగదు బదిలీ చేస్తాం, క్యాష్‌ కావాలంటూ నగదు లావాదేవీల వ్యాపారం చేసే వ్యాపారిని అడిగి ఫోన్‌పేలో 70 వేలు నగదు బదిలీ చేశారు. ఫోన్‌ పేలో నగదు ట్రాన్స్‌ఫర్‌ సక్సెస్‌ అయినట్టు రావడంతో తన ఎకౌంట్‌ను వ్యాపారి చెక్‌ చేసుకున్నాడు. 70 వేలు క్రెడిట్‌ అయినట్టు చూపించడంతో నగదు ఇచ్చేశాడు. అరగంట తర్వాత ఆ ఇద్దరు ఫోన్‌ చేసి రాంగ్‌ ఎకౌంట్‌కు నగదు బదిలీ అయిందని చెప్పారని, అలా చెప్పిన కొద్దిసేపటికే తన ఎకౌంట్‌ ఫ్రీజ్‌ అయిపోయిందని, ఇలా ఎందుకు అయిందో అర్ధంకాక చివరకు తాను మోసపోయినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశానని బాధితుడు తెలిపారు. ఫోన్‌ పే నగదు లావాదేవీల పేరుతో వ్యాపారులను మోసం చేస్తున్న ముఠా వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యర్రగొండపాలెం పరిసర ప్రాంతాల్లో మోసపోయిన పలువురు వ్యాపారులు చెప్పిన ఆనవాళ్ళ మేరకు నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. టోల్‌ప్లాజాల దగ్గర నెంబర్‌ ప్లేట్‌లేని ఓ కారు పలుమార్లు తిరిగినట్టు గుర్తించి, సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నగదు లావాదేవీల విషయంలో వ్యాపారులు, ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని యర్రగొండపాలెం ఎస్‌ఐ చౌడయ్య కోరుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే దబిడి దిబిడే.. ఇంకా జాగ్రత్త బాస్

OTT ట్రెండింగ్‌లో ఎప్‌స్టీన్ వెబ్ సిరీస్‌.. రసవత్తరంగా సాగే కథ

IRCTC: రైలు ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇక మీకు కావాల్సింది సీట్ వద్దకే

భార్య సీక్రెట్ లైఫ్‌ను బయటపెట్టిన ఆధార్‌ ఓటీపీ

The Raja Saab: రాజాసాబ్‌కు కొత్త తలనొప్పి.. ఓటీటీలో బయటపడిన నిజాలు

Sravanthi Chokarapu: బన్నీపై యాంకర్ స్రవంతి కామెంట్స్



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *