తెలుగు సినీరంగంలో ఒకటి రెండు చిత్రాల్లో కనిపించి ఆ తర్వాత కనుమరుగైన తారలు చాలా మంది ఉన్నారు. ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుని ఆతర్వాత సినిమాకు దూరమైన హీరోయిన్స్ గురించి చెప్పక్కర్లేదు. సీనియర్ హీరో శ్రీకాంథ్ కెరీర్ మలుపు తిప్పిన చిత్రాల్లో పెళ్లి సందడి ఒకటి. 1990లో విడుదలైన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. అప్పట్లో ఈ మూవీ అటు మ్యూజిక్ పరంగా.. ఇటు కంటెంట్ పరంగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో రవళి కథానాయికగా నటించింది. ఆమెతోపాటు శ్రీకాంత్ కలల రాణిగా స్వప్న సుందరిగా నటించిన హీరోయిన్ గుర్తుందా.. ? ఆమె పేరు దీప్తి భట్నగర్. అప్పట్లో కుర్రాళ్ల కలల రాణిగా మారిపోయారు. పెళ్లి సందడి సినిమాతోనే తెలుగు తెరకు పరిచయమైన ఆమె.. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇవి కూడా చదవండి: Kamal Haasan: అప్పుడు చిన్న హీరోయిన్.. ఇప్పుడు కమల్ హాసన్తోనే.. ఎవరో గుర్తుపట్టారా.. ?
ఇవి కూడా చదవండి
ఈ సినిమా తర్వాత తెలుగులో ఆమెకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. 2002లో వచ్చిన కొండవీటి సింహాసనం సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించారు. తెలుగు పలు చిత్రాల్లో నటించిన దీప్తి.. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యారు. 2002 తర్వాత ఆమె మరో సినిమా చేయలేదు. హిందీలో పలు సినిమాల్లో నటించిన దీప్తి.. బాలీవుడ్ డైరెక్టర్ రణ్ దీప్ ఆర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. పెళ్లి తర్వాత కొన్నాళ్లు చిత్రాల్లో నటించింది దీప్తి.
ఇవి కూడా చదవండి: Pawan Kalyan: ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ బెస్ట్ ఫ్రెండ్.. ఎవరో గుర్తుపట్టారా.. ?
2007లో మలయాళంలో రాకిలిపట్టు అనే సినిమాలో నటించారు. ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. కథానాయికగా కనిపించకపోయినా.. దీప్తి భట్నగర్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేసి పలు టీవీ షోలను నిర్మించారు. ఇప్పటికీ నిర్మాణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీప్తి చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతుండగా.. చాలా కాలం తర్వాత స్వప్నసుందరి దొరికేసిందిరోయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
ఇవి కూడా చదవండి: Tollywood: ఉదయం లేవగానే ముఖానికి ఉమ్మీ రాసుకుంటాను.. స్టార్ హీరోయిన్ బ్యూటీ సీక్రెట్.. ఫ్యాన్స్ షాక్..
ఇవి కూడా చదవండి: Mahesh Babu : కాలేజీలో మహేష్ బాబు బెస్ట్ ఫ్రెండ్.. ఇప్పుడు ఇండస్ట్రీలో తోపు హీరోయిన్..