Pearl Gemstone: కోపాన్ని తగ్గించి కోటీశ్వరులను చేసే ముత్యం మహిమ.. ఆ రాశుల వారు ధరిస్తే బ్యాంక్ బ్యాలెన్స్ డబుల్!

Pearl Gemstone: కోపాన్ని తగ్గించి కోటీశ్వరులను చేసే  ముత్యం మహిమ.. ఆ రాశుల వారు ధరిస్తే బ్యాంక్ బ్యాలెన్స్ డబుల్!


చంద్రుడు మన శరీరంలోని నీటి శాతాన్ని, మన ఆలోచనలను ప్రభావితం చేస్తాడు. జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్నప్పుడు మానసిక గందరగోళం, అధిక కోపం నిద్రలేమి వంటి సమస్యలు ఎదురవుతాయి. అటువంటి సమయంలో ముత్యం ధరించడం ఒక దివ్యౌషధంలా పనిచేస్తుంది. వెండి ఉంగరంలో ముత్యాన్ని పొదిగి ధరించడం వల్ల కలిగే సానుకూల మార్పులేంటో, ఏ రాశుల వారు దీనివల్ల బంపర్ బెనిఫిట్స్ పొందుతారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

మేషం, కర్కాటక

రాశుల వారికి రాజయోగం మేష రాశి వారికి చంద్రుడు నాలుగవ ఇంటికి అధిపతి కావడం వల్ల, ముత్యం ధరిస్తే భౌతిక సుఖాలు పెరుగుతాయి. కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది. ఇక కర్కాటక రాశికి అధిపతి స్వయంగా చంద్రుడే కాబట్టి, వీరికి ముత్యం ప్రాణప్రదమైనది. దీనివల్ల వీరిలోని మానసిక గందరగోళం తొలిగిపోయి, కుటుంబంలో సామరస్యం పెరుగుతుంది. ఏకాగ్రత పెరగడం వల్ల కెరీర్ లో అద్భుతమైన పురోగతిని సాధిస్తారు.

వృశ్చిక, మీన రాశుల వారికి శాంతి

వృశ్చిక రాశి వారు సహజంగానే కొంచెం ఆవేశపరులు. ముత్యం ధరించడం వల్ల వీరి కోపం అదుపులోకి వచ్చి, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. సంబంధాలలో మాధుర్యం పెరగడంతో పాటు ఆర్థికంగా స్థిరపడతారు. అలాగే మీన రాశి వారికి ముత్యం వల్ల మానసిక స్పష్టత లభిస్తుంది. గందరగోళ పరిస్థితుల్లో కూడా సరైన నిర్ణయాలు తీసుకుని విజయం సాధిస్తారు. వీరి జీవితంలో సానుకూల మార్పులు మొదలై, అదృష్టం వీరిని వరిస్తుంది.

ధరించే పద్ధతి ఆరోగ్య ప్రయోజనాలు

ముత్యాన్ని ఎల్లప్పుడూ వెండి లోహంలోనే ధరించాలి. శుక్ల పక్ష సోమవారం నాడు పాలు, గంగాజలంతో శుద్ధి చేసి ఓం సౌం సోమాయ నమః’ అనే మంత్రాన్ని జపిస్తూ కుడి చేతి చిటికెన వేలికి ధరించడం అత్యంత శుభప్రదం. జ్యోతిష్య పరంగానే కాకుండా, ముత్యం ధరించడం వల్ల రక్తపోటు (Blood Pressure) అదుపులో ఉంటుంది జీర్ణక్రియ మెరుగుపడుతుంది. సహజమైన ముత్యాన్ని మాత్రమే ఎంచుకోవడం వల్ల పైన పేర్కొన్న పూర్తి ఫలితాలను పొందవచ్చు.

గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. రత్నాలను ధరించే ముందు మీ వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి నిపుణులైన జ్యోతిష్కులను సంప్రదించడం మంచిది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *