పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఇప్పుడు తన సినిమాలపై ఫోకస్ పెట్టారు. ఇటీవలే హరి హర వీరమల్లు సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలను సైతం కంప్లీట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు పవన్. ఇదిలా ఉంటే.. ఈరోజు ఫ్రెండ్షిప్ డే. ఈ సందర్భంగా పవన్ కు సంబంధించిన ఓ త్రోబ్యాక్ ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇంతకీ ఆ ఫోటోలో పవన్ ఆటపట్టిస్తున్న ఆ వ్యక్తిని గుర్తుపట్టారా.. ? సినీరంగంలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే నిత్యం పవన్ వెంటే ఉంటారు.
ఇవి కూడా చదవండి: Actress : ఒక్క సినిమాతో ఫేమస్.. ముద్దు సీన్ అనగానే గుక్కపెట్టి ఏడ్చేసింది.. దెబ్బకు ఆఫర్స్ గోవిందా..
ఇండస్ట్రీలో పవన్ బెస్ట్ ఫ్రెండ్ అంటే ఠక్కున గుర్తుచ్చే పేరు త్రివిక్రమ్ శ్రీనివాస్. వీరిద్దరూ ఒకే మాట అన్నట్లుగా ఉంటారు. చాలా సందర్భాల్లో త్రివిక్రమ్ తో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు పవన్. కానీ మీకు తెలుసా..? త్రివిక్రమ్ కాకుండా ఇండస్ట్రీలో పవన్ ప్రాణ స్నేహితులు మరొకరు ఉన్నారు. కెరీర్ మొదటి నుంచి ఇప్పటికీ వీరిద్దరూ కలిసే ఉంటారు. పవన్ ఎక్కడికి వెళ్లినా తన స్నేహితుడు పక్కనే ఉంటారు. పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ వ్యక్తి మరెవరో కాదు..పవన్ బెస్ట్ ఫ్రెండ్ ఆనంద్ సాయి. ఆయన ఇండస్ట్రీలో ఆర్ట్ డైరెక్టర్ గా ఎన్నో సినిమాలకు పనిచేశారు. ఆనంద్ సాయి ఎక్కువగా వార్తలలో కనిపించారు.
ఇవి కూడా చదవండి
ఇవి కూడా చదవండి: Serial Actress: తస్సాదియ్యా అమ్మడు.. సీరియల్స్ మానేసింది.. ఇప్పుడు నెట్టింట సెగలు పుట్టిస్తోంది..
ఎన్నో హిట్ చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్ పనిచేసిన ఆనంద్ సాయి.. చివరగా 2014లో ఎవడు సినిమాకు పనిచేశారు. ఆతర్వాత 2015లో పవన్ నటించిన గోపాల గోపాల సినిమాకు పవన్ లుక్ కు సంబంధించిన స్కెచ్ వర్క్ చేశారు. గతంలో తెలంగాణలో యాదాద్రి ఆలయ పునః నిర్మాణానికి గుడి డిజైన్ చేసింది కూడా పవన్ బెస్ట్ ఫ్రెండ్ ఆనంద్ సాయి కావడం విశేషం. అటు సినిమాలతోపాటు రాజకీయాల్లోనూ పవన్ కు అండగా ఉంటారు ఆనంద్ సాయి. ఇప్పటికీ పవన్ వెంటే ఉంటారు ఆనంద్ సాయి.
Cinema: ఏం సినిమా రా బాబూ.. ఏకంగా 17400 కోట్ల కలెక్షన్స్.. దెబ్బకు బాక్సాఫీస్ షేక్..

Pawan Kalyan, Anand Sai
ఇవి కూడా చదవండి: Tollywood: పొలిటికల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్.. టాలీవుడ్లో క్రేజీ హీరో.. ఇంతకీ ఆ స్టార్ ఎవరంటే..