Patanjali Lohasava: రక్తహీనతకు ఆయుర్వేదంతోనూ చెక్.. పతంజలి టానిక్‌ సీక్రెట్ చెప్పిన బాబా రాందేవ్‌

Patanjali Lohasava: రక్తహీనతకు ఆయుర్వేదంతోనూ చెక్.. పతంజలి టానిక్‌ సీక్రెట్ చెప్పిన బాబా రాందేవ్‌


Patanjali Lohasava: రక్తహీనతకు ఆయుర్వేదంతోనూ చెక్.. పతంజలి టానిక్‌ సీక్రెట్ చెప్పిన బాబా రాందేవ్‌

నేటికాలంలో రక్తహీనత సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా మహిళల్లో ఇది సర్వసాధారణం. రక్తహీనత నుంచి బయటపడేందుకు డాక్టర్లు ఐరన్‌ మందులు, సిరప్‌లు, సప్లిమెంట్లను సూచిస్తుంటారు. అయితే ఆయుర్వేదంలో రక్తహీనతకి నివారణ ఉందా? అని చాలా మందికి సందేహం ఉంటుంది. తాజాగా ఈ సమస్యపై స్వామి రామ్‌దేవ్ ప్రస్తావించారు. ‘పతంజలి లోహాసావ్’ అనే టానిక్‌.. రక్తహీనత, ఐరన్‌ లోపానికి చికిత్స చేయడానికి ప్రత్యేకంగా తయారు చేసినట్లు రాందేశ్‌ తెలిపారు. ఇది లోహ భస్మాన్ని ఉపయోగించి తయారు చేసినట్లు పేర్కొన్నారు.

ఆయుర్వేదం ప్రకారం ఈ టానిక్‌ శరీరం మూలికా పదార్థాలను బాగా గ్రహించడంలో సహాయపడుతుంది. ఇది ఐరన్‌, హిమోగ్లోబిన్‌ను పెంచడానికి సహాయపడుతుంది. ఈ టానిక్ ఆయుర్వేద మూలికలను ఉపయోగించి తయారు చేయబడింది. దీని వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవని అన్నారు. పతంజలి పరిశోధనా సంస్థ విస్తృత పరిశోధన తర్వాత ఈ టానిక్‌ తయారు చేసినట్లు పేర్కొన్నారు. ఇది రక్తహీనత, తక్కువ హిమోగ్లోబిన్ చికిత్సలో సహాయపడుతుందన్నారు. అలాగే బలహీనత, అలసట, తలతిరుగుడు నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుందని వివరించారు.

ఎవరికి ప్రయోజనకరం?

లోహాసావ టానిక్‌ కేవలం పెద్దలు, మహిళల కోసం మాత్రమే రూపొందించబడిన ఆయుర్వేద ఉత్పత్తి. ఇది రక్తహీనతతో బాధపడేవారికి, వృద్ధాప్యంలో బలహీనతతో బాధపడేవారికి, సరైన ఆహారం తీసుకోని వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. లోహాసావను సమాన మొత్తంలో నీటితో కలిపి తాగాలి. అవసరమైతే మోతాదు కూడా మార్చుకోవచ్చు. ఇటువంటి ఔషధాన్ని తీసుకునే ముందుగా వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం. డాక్టర్‌ సలహా లేకుండా ఏ ఔషధాన్ని తీసుకోకూడదు. ఎందుకంటే ఇలాంటి సొంత ప్రయోగాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి.

రక్తహీనత ఎందుకు ఏర్పడుతుంది?

ముఖ్యంగా మహిళల్లో రక్తహీనత ఎక్కువగా కనిపిస్తుంది. పోషకాహార లోపం దీనికి ప్రధాన కారణం. శరీరంలో రక్తం లేకపోవడానికి రక్తహీనత కారణమవుతుంది. రక్త నష్టం తీవ్రంగా ఉంటే ఆరోగ్యానికి మరింత హానికరంగా మారుతుంది. ఇటువంటి సందర్భాలలో వైద్యుడి సలహా మేరకు మాత్రమే మందులు తీసుకోవాలి.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *