Patanjali: పతంజలి బిగ్ అప్‌డేట్.. ఆ రోజే మొదటి త్రైమాసిక ఫలితాల విడుదల

Patanjali: పతంజలి బిగ్ అప్‌డేట్.. ఆ రోజే మొదటి త్రైమాసిక ఫలితాల విడుదల


బాబా రామ్‌దేవ్ పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ 30 జూన్ 2025తో ముగిసిన త్రైమాసిక ఫలితాల ప్రకటనకు సంబంధించి బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. కంపెనీ తన మొదటి త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ఆగస్టు 14న విడుదల 2025న విడుదల చేస్తుందని తెలిపింది. ఆగస్టు 14న డైరెక్టర్ల బోర్డు సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మొదటి త్రైమాసిక ఆర్థిక ఫలితాలను చర్చించి ఆమోదించడం జరుగుతుందని స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌కు కంపెనీ తెలిపింది.

ఫలితాల తర్వాత ట్రేడింగ్ విండో క్లోజ్

ఆగస్టు 14న ఆర్థిక ఫలితాలు ప్రకటించిన తర్వాత 48 గంటల పాటు ట్రేడింగ్ విండో  క్లోజ్ కానుంది. అంటే ఈ సమయంలో కంపెనీతో సంబంధం ఉన్న ఏ ఇన్‌సైడర్ షేర్లను కొనుగోలు చేయలేరు లేదా విక్రయించలేరు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇన్‌సైడర్ ట్రేడింగ్ నిబంధనల ప్రకారం ఈ క్లోజింగ్ అమల్లో ఉండనుంది.

వాటాదారులకు బోనస్ షేర్లు

పతంజలి ఫుడ్స్ తన పెట్టుబడిదారులకు బోనస్ షేర్లను ఇవ్వబోతోంది. 2:1 బోనస్ షేర్లను జారీ చేయాలనే ప్రతిపాదనను తమ బోర్డు ఆమోదించిందని కంపెనీ జూలై 17న ప్రకటించింది. కంపెనీలో 1శాతం వాటా ఉంటే, అదనంగా 2షేర్లు ఉచితంగా లభిస్తాయి. అయితే, బోనస్ షేర్లకు రికార్డు డేట్‌ను ఇంకా ప్రకటించబడలేదు.

Q4లో అదిరే లాభాలు

మార్చి త్రైమాసికంలో పతంజలి ఫుడ్స్ మంచి ఫలితాలను నమోదు చేసింది. కంపెనీ ఏకీకృత నికర లాభం గతేడాది ఇదే కాలంలో రూ. 206.3 కోట్లు ఉంటే ఈ సారి రూ. 358.5 కోట్లకు చేరుకుంది. కంపెనీ ఆదాయం 17.8% పెరిగి రూ. 9,692.2 కోట్లకు చేరుకుంది. కంపెనీ EBITDA కూడా అద్భుతంగా ఉంది. గతేడాది ఇదే సమయంలో రూ. 376.5 కోట్లు ఉండగా.. రూ. 37.1% పెరిగి రూ. 516.2 కోట్లకు చేరుకుంది. మెరుగైన వ్యయ నియంత్రణ, పెరుగుతున్న స్కేల్ కారణంగా, కంపెనీ నిర్వహణ మార్జిన్ కూడా 4.6% నుండి 5.3శాతానికి పెరిగింది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *