Parenting Tips: పిల్లల ముందు మీరు ఏడుస్తున్నారా..? ఇలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసా..?

Parenting Tips: పిల్లల ముందు మీరు ఏడుస్తున్నారా..? ఇలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసా..?


లైఫ్‌లో అన్ని రోజులు ఒకేలా ఉండవు. కొన్నిసార్లు బాధ, స్ట్రెస్ మనల్ని చుట్టుముట్టవచ్చు. అలాంటి టైమ్‌లో పేరెంట్స్ కూడా ఏడుస్తారు. ఇలా ఏడుస్తుంటే చూసిన పిల్లల మనసులో చాలా క్వశ్చన్స్ వస్తాయి. ఎందుకు ఏడుస్తున్నారు..? ఏమైనా పెద్ద ప్రాబ్లమా..? అనే భయం రావచ్చు. మరి ఈ సిట్యుయేషన్ వాళ్ళపై ప్రెజర్ పెంచుతుందా..? లేదా వాళ్ళు దీని నుంచి ఏమైనా నేర్చుకుంటారా..? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఏడవడం తప్పు కాదు కానీ..

మీరు ఏడుస్తుండగా మీ పిల్లలు చూస్తే.. వాళ్ళు వెంటనే భయపడవచ్చు. అలాంటి టైమ్‌లో మీరు ముందు మీ ఎమోషన్స్‌ని కొద్దిగా కంట్రోల్ చేసుకోవాలి. తర్వాత వాళ్ళకి సింపుల్ వర్డ్స్‌లో విషయం అర్థమయ్యేలా చెప్పాలి.

బంగారం ఈ రోజు అమ్మ/నాన్న మనసు కొంచెం బాగాలేదు. కొన్నిసార్లు బాధగా అనిపించడం అందరికీ మామూలే. ఏడిస్తే మనసు తేలికపడుతుంది. తర్వాత నేను మళ్లీ నవ్వుతూ నీతో ఆడుకుంటాను నీకు ఇష్టమైనవన్నీ చేద్దాం. ఇద్దరం కలిసి బాగా ఎంజాయ్ చేద్దాం. ఇలా చెప్పడం వల్ల ఎమోషన్స్ అనేవి లైఫ్‌లో నాచురల్ అని పిల్లలకు తెలుస్తుంది. హ్యాపీనెస్ ఒక్కటే కాదు.. బాధ కూడా మన లైఫ్‌లో పార్టే అని అర్థం చేసుకుంటారు.

పిల్లలు ఏం నేర్చుకుంటారు..?

  • ప్రతి ఒక్కరూ కొన్నిసార్లు బాధపడతారు.. ఇది తప్పు కాదు లైఫ్‌లో ఒక పార్ట్ మాత్రమే.
  • ఫీలింగ్స్ బయటపెట్టడం కరెక్టే.. ఇది మెంటల్ హెల్త్‌కి ఎంత ఇంపార్టెంట్ అనేది వాళ్ళకి తెలుస్తుంది.
  • ఒకరు బాధగా ఉన్నా స్ట్రాంగ్‌గా ఉండవచ్చు.. ఇది వాళ్ళకి ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేయడానికి ధైర్యాన్ని ఇస్తుంది.
  • ఈ ఎక్స్‌పీరియన్సెస్ వాళ్ళ ఎమోషనల్ మెచ్యూరిటీ, కాన్ఫిడెన్స్‌ని పెంచుతాయి.

పేరెంట్స్ మైండ్‌లో పెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు

  • పిల్లల్ని బ్లేమ్ చేయొద్దు.. మీరు బాధపడుతున్నదానికి కారణం వాళ్ళు కాదని క్లియర్‌గా చెప్పాలి.
  • మీ బాధను వాళ్ళపై పెట్టొద్దు.. ఈ ఫీలింగ్స్ వాళ్ళకి భయంగా అనిపించకూడదు.
  • అబద్ధాలు చెప్పొద్దు.. మీరు ఏడుస్తున్నప్పుడు ఏమీ కాదు, నేను ఓకే అని చెప్పొద్దు. అది వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తుంది.
  • బ్యాడ్‌గా ప్రవర్తించొద్దు.. కోపంతో అరిచి, వస్తువులను విసిరేయడం లాంటివి వాళ్ళని భయపెట్టవచ్చు.

ఈ విధంగా పిల్లల ఎదుగుదలలో ఎమోషన్స్‌ రోల్‌ని వాళ్ళకి క్లియర్‌గా చెప్తే.. వాళ్ళు స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉన్న వ్యక్తులుగా మారతారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *