పాన్-ఆధార్ అనుసంధానం చేసుకోవడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దేశంలో పాన్ కార్డు కలిగి ఉన్న ప్రతిఒక్కరూ ఆధార్ కార్డుతో లింక్ చేయాలి. లేకపోతే ఆర్ధిక సేవలు పొందటంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముంది. అయితే కొంతమంది ఎంత ట్రై చేసినా పాన్‌కార్డుతో ఆధార్ లింక్ అవ్వదు. ఇలాంటప్పుడు ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో ఇప్పుడు చూద్దాం
పాన్-ఆధార్ లింక్ కాకపోవడానికి ప్రధాన కారణం వీటిల్లో మీ పేరు, పుట్టిన తేదీ లాంటి వివరాలు వేర్వేరుగా ఉండటం. పాన్ కార్డులో ఒకలా.. ఆధార్ కార్డులో మరోలా పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే లింక్ అవ్వదు. పేరుతో అక్షర దోషాలు లేదా డేట్ ఆఫ్ బర్త్ ఒక్కొదానిలో ఒకలా ఉండటం వల్ల అనుసంధానం కాదు. డీటైల్స్ వేర్వేరుగా ఉండటం వల్ల సిస్టమ్ ప్రాసెస్ చేయదు
ఇలాంటప్పుడు మీరు ఏ కార్డులో అయితే తప్పుగా వివరాలు ఉన్నాయో.. ఆ కార్డులోని వివరాలు అప్డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. పాత ఆధార్ కార్డుల్లో కేవలం పుట్టిన సంవత్సరం మాత్రమే ఉంటుంది. తేదీ ఉండదు. అప్పుడు లింక్ అవ్వకుండా డేటా మిస్‌మ్యాచ్ అని చూపిస్తూ ఉంటుంది.
ఎందులో అయితే తప్పుగా వివరాలు నమోదయ్యాయో.. వాటిని అప్డేట్ చేసుకోండి. ఆ తర్వాత లింక్ చేసుకుంటే ఖచ్చితంగా అవుతుంది. ఆధార్ కార్డులో తప్పులు ఉంటే ఆన్లైన్లో యూఐడీఏఐ వెబ్ సైట్ ద్వారా చేసుకోవచ్చు. ఇక పాన్ కార్డు వివరాలు ఎన్ఎస్డీఎల్ పోర్టల్ ద్వారా మార్చుకోవచ్చు.
డీటైల్స్ మార్చుకోవడానికి అప్లై చేసుకున్న తర్వాత వెంటనే లింక్ కోసం ప్రయత్నం చేయకూడదు. మీ వివరాలు సిస్టమ్‌లో అప్డేట్ అయ్యాక ప్రయత్నించాల్సి ఉంటుంది. కొంతమంది అప్డేట్ కోసం దరఖాస్తు చేసుకున్న వెంటనే ప్రయత్నిస్తారు. అలాంటప్పుడు మళ్లీ రీజెక్ట్ అవువుతంది.




