Pakistan: పాకిస్తాన్‌లో తెల్లవారుజామున కంపించిన భూమి.. తీవ్రత 5.2గా నమోదు.. భయాందోళనల్లో ప్రజలు

Pakistan: పాకిస్తాన్‌లో తెల్లవారుజామున కంపించిన భూమి.. తీవ్రత 5.2గా నమోదు.. భయాందోళనల్లో ప్రజలు


ఆదివారం ఉదయం పాకిస్తాన్‌లో బలమైన భూకంప ప్రకంపనలు సంభవించాయి. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.2గా నమోదైంది. భూకంప ప్రకంపనలు చాలా బలంగా ఉండటంతో ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. నేషనల్ సెంటర్ ఆఫ్ సీస్మోలజీ నివేదిక ప్రకారం.. ఈ రోజు తెల్లవారుజామున 3:54 గంటలకు 5.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. NCS ప్రకారం 150 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది.

ప్రపంచంలో అత్యంత భూకంప నిరోధక దేశాలలో పాకిస్తాన్ ఒకటి. ఫలితంగా పాకిస్తాన్‌లో భూకంపాలు తరచుగా సంభవిస్తాయి. అవి వినాశకరమైనవిగా ఉంటాయి. పాకిస్తాన్ భౌగోళికంగా యురేషియా, భారత టెక్టోనిక్ ప్లేట్‌లను అతివ్యాప్తి చేస్తుంది. బలూచిస్తాన్, సమాఖ్య పరిపాలన గిరిజన ప్రాంతాలు, ఖైబర్ పఖ్తుంఖ్వా , గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రావిన్సులు యురేషియా ప్లేట్ దక్షిణ అంచున ఇరానియన్ పీఠభూమిలో ఉన్నాయి.

దక్షిణాసియాలోని భారత ప్లేట్ వాయువ్య అంచున సింధ్, పంజాబ్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ, కాశ్మీర్ ప్రావిన్సులు ఉన్నాయి. అయితే రెండు టెక్టోనిక్ ప్లేట్లు ఢీకొనడం వల్ల ఈ ప్రాంతం భారీ భూకంపాలకు ప్రసిద్ధి చెందింది. అయితే ఈ రోజు ఏర్పడిన భూకంపం వలన ఇప్పటివరకు ఎటువంటి నష్టం జరిగినట్లు నివేదికలు లేవు.

భూకంపాల చరిత్ర ఏమిటి?

గత కొన్ని సంవత్సరాలుగా.. భారతదేశ పొరుగు దేశమైన పాకిస్తాన్‌లో భూకంపాలు సంభవిస్తునే ఉన్నాయి. వీటిని చాలా ప్రమాదకరమైనవిగా భావిస్తారు. ఉదాహరణకు 2005లో ముజఫరాబాద్‌లో 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపం సంభవించి 87 వేల మంది మరణించారు. 2007లో బలూచిస్తాన్‌లో 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం సంభవించి 825 మంది మరణించారు. ఈ గణాంకాలతో పాకిస్తాన్‌లో మధ్యస్థం నుంచి అధిక తీవ్రత కలిగిన భూకంపాలు తరచుగా సంభవిస్తాయని స్పష్టంగా తెలుస్తుంది. అందుకనే ప్రకృతి విపత్తు నిర్వహణ పాత్ర చాలా ముఖ్యమైనది.

భూకంపం వస్తే ఏమి చేయాలి?

భూకంపం సమయంలో బలమైన టేబుల్ లేదా డెస్క్ కింద దాక్కోవాలి. గోడలు, కిటికీలు, విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలి. బయట ఉంటే బహిరంగ ప్రదేశానికి వెళ్లాలి. లిఫ్ట్ ఉపయోగించకూడదు. భూకంపం సమయంలో పుకార్లు వ్యాప్తి చేయకుండా ఉండాలి. అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *