PAK vs NED: ఆడకుండానే టీ20 ప్రపంచకప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. తొలి మ్యాచ్‌కు ముందే దిమ్మతిరిగే షాక్..?

PAK vs NED: ఆడకుండానే టీ20 ప్రపంచకప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. తొలి మ్యాచ్‌కు ముందే దిమ్మతిరిగే షాక్..?


Pakistan vs Netherlands Match Likely to Be Washed Out Due to Rain – Weather Update: 2026 టీ20 ప్రపంచ కప్ ఫిబ్రవరి 7 నుంచి మొదలుకానుంది. తొలి మ్యాచ్ లో భాగంగా పాకిస్తాన్ వర్సెస్ నెదర్లాండ్స్ మధ్య కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్‌లో జరగనుంది. ఈ మ్యాచ్ ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్‌కు ముందు పాకిస్తాన్ హాట్ టాపిక్ గా మారింది. రోజుకో మాటతో ఇప్పటి వరకు పుకార్లు పుట్టించిన పాక్.. ఎట్టకేలకు టీ20 ప్రపంచకప్ బరిలోకి దిగనుంది. అయితే, ఫిబ్రవరి 15న భారత్‌తో జరిగే మ్యాచ్‌ ఆడమంటూ నిర్ణయించుకుంది. దీంతో గ్రూప్ ఏలో పాక్ జట్టు పరిస్థితి దారుణంగా తయారైంది. ఎందుకంటే, భారత జట్టుతో మ్యాచ్ ఆడకపోవడంతో తదుపరి రౌండ్ కు వెళ్లడంపై అనుమానాలు వినిపస్తున్నాయి. ఈ క్రమంలో పాక్ జట్టుకు మరో బిగ్ షాక్ తగలనుంది. అదేంటో ఓసారి చూద్దాం..

ఆస్ట్రేలియాపై సిరీస్ గెలిచిన పాక్..

పాకిస్తాన్ జట్టు ఇటీవలే ఆస్ట్రేలియా జట్టును ఓడించి సిరీస్‌ను గెలుచుకుంది. ఇది పాక్ జట్టుకు కొంత బలాన్ని ఇచ్చింది. అయితే పాక్ జట్టు ఇటీవల టీ20 రికార్డులు చాలా చెత్తగా ఉన్నాయి. బాబర్ అజామ్, ఫఖర్ జమాన్ వంటి కీలక ఆటగాళ్లు ఫామ్‌తో ఇబ్బందులు పడుతున్నారు.

నెదర్లాండ్స్ తో తొలి మ్యాచ్..

నెదర్లాండ్స్ జట్టుతో పాక్ జట్టు తమ తొలి మ్యాచ్ ఆడనుంది. పాక్ జట్టు కూడా నెదర్లాండ్స్ జట్టును తేలికగా తీసుకుంటే, ఇబ్బందులు పడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే, 2022 ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికాపై సంచలన విజయం సాధించిన నెదర్లాండ్స్ జట్టు.. ఏ జట్టుకైనా తనదైన రోజున షాక్ ఇవ్వనుంది. ముఖ్యంగా నెదర్లాండ్స్ జట్టు కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్, మాక్స్ ఓ’డౌడ్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, పాల్ వాన్ మీకెరెన్ వంటి ఆటగాళ్ళు అద్భుతంగా రాణిస్తున్నారు.

మ్యాచ్ రద్దు కావొచ్చు..

ముఖ్యంగా పాకిస్తాన్ జట్టుకు కూడా కొన్ని బ్యాడ్ న్యూస్ లు వస్తున్నాయి. నెదర్లాండ్స్ జట్టుతో మ్యాచ్ ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే, ప్రస్తుతం శ్రీలంకలో ఉదయం వర్షం పడే అవకాశం ఉంది. మధ్యాహ్నం దట్టంగా మేఘాలు విస్తరించనున్నాయి. మధ్యాహ్నం వర్షం పడే అవకాశం 68% ఉంది. ఇది రెండవ ఇన్నింగ్స్‌ను ప్రభావితం చేస్తుంది. ఇటువంటి పరిస్థితిలో టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఐర్లాండ్‌తో పాకిస్తాన్ వార్మప్ మ్యాచ్‌లో జరిగినట్లుగా, వర్షం భారీగా పడితే, మ్యాచ్ అంతరాయం కలిగించవచ్చు లేదా రద్దు కావొచ్చు.

మ్యాచ్ రద్దైతే పాక్ ఇంటికే..

వర్షంతో మ్యాచ్ రద్దయితే, పాకిస్తాన్ జట్టు ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 నుంచి తప్పుకోవడం ఖాయం కానుంది. ఎందుకంటే, ఈ మ్యాచ్ రద్దయితే, పాక్ జట్టుకు ఒకే పాయింట్ వస్తుంది. అలాగే, భారత జట్టుతో మ్యాచ్ బహిష్కరిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో పాక్ జట్టుకు మరో రెండు మ్యాచులు మాత్రమే ఉంటాయి. సూపర్ 8కు వెళ్లాలంటే మాత్రం చాలా కష్టపడాల్సి రావొచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *