Hyderabad: చిన్నారులపై కుక్కలు దాడులు చేస్తుంటే.. మీరేం చేస్తున్నారు?.. అధికారులపై HRC సిరియస్
ఖైరతాబాద్‌లో చిన్నారిపై వీధి కుక్క దాడి చేసిన ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. కేసును సుమోటోగా స్వీకరించింది. చిన్నారి శర్విన్‌పై జరిగిన దాడి తీవ్రతను పరిగణలోకి తీసుకుని సమగ్ర విచారణ జరపాలని కమిషన్ ఆదేశించింది. ఈ ఘటన పిల్లల భద్రత, జీవించే హక్కును ప్రభావితం చేసే అంశమని కమిషన్ అభిప్రాయపడింది. చిన్నారిని తీవ్రంగా గాయపరిచిన ఈ దాడిపై బాధ్యత ఎవరిది అనే అంశంపై స్పష్టత తీసుకురావాలని పేర్కొంది. ఈ మేరకు కమిషన్ జ్యుడీషియల్…