Vande Bharat Sleeper: ఆరంభం అదిరింది.. కానీ తర్వాత ఇలా! వందే భారత్ స్లీపర్ రైలులో ఫుడ్‌పై విమర్శలు
ఇండియన్ రైల్వేస్‌కే గర్వకారణంగా నిలిచేలా వందే భారత్ స్లీపర్ రైలును రూపొందించారు. ఈ నెల 17న ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైలును అట్టహాసంగా ఆరంభించారు. అయితే ఆరంభమై వారం కూడా కాలేదు అంతలోనే ఈ రైలులో ఓ విషయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైలులో అందించే ఆహారం నాణ్యత, పరిమాణం గురించి ప్రయాణీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కామాఖ్య-హౌరా వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్‌ను శనివారం ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. రాత్రిపూట ప్రయాణం కోసం…