
గొంతు నొప్పితో ఇబ్బందిగా ఉందా..? ఇలా చేయండి చాలు.. నొప్పి నుండి వెంటనే రిలీఫ్ ఉంటుంది..!
అల్లంలో జింజెరాల్ అనే సహజ పదార్థం ఉంటుంది. ఇది శ్వాసకు సంబంధించిన ఇబ్బందులను తగ్గిస్తుంది. దీనికి తేనె కలిపినప్పుడు అది శరీరానికి బ్యాక్టీరియాను అడ్డుకునే గుణాలను ఇస్తుంది. మంటను కూడా తగ్గిస్తుంది. ఈ మిశ్రమాన్ని వేడి నీటితో తాగడం వల్ల గొంతులో అసౌకర్యం తగ్గుతుంది. పసుపులో కర్కుమిన్ అనే ముఖ్యమైన భాగం ఉంటుంది. ఇది బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ లను అడ్డుకుంటుంది. దీన్ని వేడి నీటిలో కలిపి తాగడం వల్ల గొంతు ఇబ్బందుల నుండి త్వరగా కోలుకోవచ్చు….