OTT Movies: వరుసగా మూడు రోజులు సెలవులు.. ఓటీటీల్లో కొత్త సినిమాల జాతర.. శుక్రవారం ఒక్క రోజే 15 కు పైగా..

OTT Movies: వరుసగా మూడు రోజులు సెలవులు.. ఓటీటీల్లో కొత్త సినిమాల జాతర.. శుక్రవారం ఒక్క రోజే 15 కు పైగా..


తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం హాలీడే సీజన్ కొనసాగుతోంది. వరసగా వరలక్ష్మీ వ్రతం, రెండో శనివారం, ఆదివారం.. ఇలా వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో ఎంచెక్కా ఫ్యామీలీతో గడపవచ్చు. ఇక ఈ సెలవుల్లో మిమ్మల్ని ఎంటర్ టైన్ చేసేందుకు కొత్త సినిమాలు కూడా రెడీ అవుతున్నాయి. అయితే ఈ శుక్రవారం థియేటర్లలో పెద్ద సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. బకాసురతో పాటు సు ఫ్రమ్ సో అనే కన్నడ డబ్బింగ్ మూవీ థియేటర్లలోకి రానున్నాయి. అదే సమయంలో ఓటీటీలో మాత్రం 15కు పైగా సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన చిత్రాలు కూడా ఓటీటీల్లో అందుబాటులోకి రానున్నాయి. అలాగే హాలీవుడ్ మూవీస్ కూడా ఉన్నాయి. ఈ వారం ఓటీటీల్లో మోతెవరి లవ్ స్టోరీ వెబ్ సిరీస్ ఆసక్తికరంగా కనిపిస్తోంది. తెలంగాణ కుర్రాడు అనిల్ జీల ఇందులో హీరోగా నటించాడు. వీటితో పాటు తెలుగమ్మాయి ఆనంది నటించిన అరేబియా కడలి కూడా స్ట్రీమింగ్ కు రానుంది. వీటితో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు కూడా స్ట్రీమింగ్ కు రానున్నాయి. మరి ఆగస్టు మొదటి వారంలో ఏయే ఓటీటీల్లో ఏయే సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తున్నాయో తెలుసుకుందాం రండి.

ఇవి కూడా చదవండి

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో..

  • ఓహో ఎంతన్ బేబీ(తెలుగు డబ్బింగ్ సినిమా)- ఆగస్టు 08
  • స్టోలెన్-హైయిస్ట్ ఆఫ్ ది సెంచరీ(హాలీవుడ్ సినిమా)- ఆగస్టు 08
  • మ్యారీ మీ- (హాలీవుడ్ మూవీ) – ఆగస్టు 10
  • ది ఆక్యుపెంట్-(హాలీవుడ్ సిరీస్) ఆగస్టు 09

జీ5 ఓటీటీలో..

  • మామన్(తమిళ సినిమా)- ఆగస్టు 08
  • మోతెవరి లవ్ స్టోరీ (తెలుగు వెబ్ సిరీస్)- ఆగస్టు 08
  • జరన్ (మరాఠీ సినిమా) – ఆగస్టు 08

అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో..

  • అరేబియా కడలి (తెలుగు వెబ్ సిరీస్)- ఆగస్టు 08

జియో హాట్‌స్టార్..

  • సలకార్(హిందీ వెబ్ సిరీస్)- ఆగస్టు 08

సోనీలివ్

  • బ్లాక్ మాఫియా ఫ్యామిలీ-సీజన్-4(అమెరికన్ సిరీస్)- ఆగస్టు 08

సన్‌ నెక్ట్స్ ఓటీటీలో..

  • హెబ్బులి కట్(కన్నడ సినిమా)- ఆగస్టు 08
  • లయన్స్ గేట్ ప్లే
  • ప్రెట్టి థింగ్ (హాలీవుడ్ మూవీ) – ఆగస్టు 08
  • బ్లాక్ మాఫియా సీజన్ -4 (హాలీవుడ్ వెబ్ సిరీస్) – ఆగస్టు 08

ఎమ్ఎక్స్ ప్లేయర్

  • బిండియే కే బాహుబలి (హిందీ వెబ్ సిరీస్) – ఆగస్టు 08

సైనా ప్లే

  • నడికర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – ఆగస్టు 08

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *